Union Minister Nitin Gadkari: ఆంధ్రలో 46 వేల కోట్లతో జాతీయ రహదారులు
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:41 AM
ఏపీలో రూ. 46,946 కోట్లతో 92 జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులను చేపట్టినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో సభ్యుడు అడిగిన....
2027 నాటికి మొత్తం 92 ప్రాజెక్టులూ పూర్తి: గడ్కరీ
న్యూఢిల్లీ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఏపీలో రూ. 46,946 కోట్లతో 92 జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులను చేపట్టినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకుసమాధానమిస్తూ... ‘2,090 కిలోమీటర్ల మేర మొత్తం 92 ప్రాజెక్టులను చేపట్టాం. ఇప్పటివరకు 1,157 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది. రూ.46,946 కోట్లకు గానూ రూ.21,382 కోట్లు ఖర్చు చేశాం. ప్రస్తుతం చేపట్టిన 92 ప్రాజెక్టులను 2027 నాటికి పూర్తి చేస్తాం’ అని గడ్కరీ తెలిపారు.