Share News

Durga Goddess: పాల కలశాలతో దుర్గమ్మకు అభిషేకం

ABN , Publish Date - Oct 01 , 2025 | 05:22 AM

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా వి.కోటలో 4,501 కలశాలతో మహిళలు దుర్గమ్మకు...

Durga Goddess: పాల కలశాలతో దుర్గమ్మకు అభిషేకం

  • తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు

వి.కోట, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా వి.కోటలో 4,501 కలశాలతో మహిళలు దుర్గమ్మకు పాలాభిషేకం చేసి రికార్డు సృష్టించారు. వి.కోటలో ఏటా దుర్గమ్మకు దుర్గాష్టమి రోజున పాల కలశాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా మంగళవారం మహిళలు పాల కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రను తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు పరిశీలించి.. 4,501 మంది మహిళలు పా ల కలశాలను 2 కి.మీ. మేర ప్రదర్శనగా తీసుకొచ్చి 4 గంట ల్లో అమ్మవారికి సమర్పించడం రికార్డుగా నమోదు చేశారు.

Updated Date - Oct 01 , 2025 | 05:22 AM