Share News

Kurnool: 4.50 కిలోల బాలభీముడు

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:35 AM

సాధారణంగా పిల్లలు 2.5 నుంచి 3.5 కిలోల బరువుతో జన్మిస్తారు. అటువంటిది కర్నూలు జిల్లా కోడుమూరు ప్రభుత్వాసుపత్రిలో 4.50 కిలోల బరువుతో బాలుడు జన్మించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Kurnool: 4.50 కిలోల బాలభీముడు

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా పిల్లలు 2.5 నుంచి 3.5 కిలోల బరువుతో జన్మిస్తారు. అటువంటిది కర్నూలు జిల్లా కోడుమూరు ప్రభుత్వాసుపత్రిలో 4.50 కిలోల బరువుతో బాలుడు జన్మించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. గోనెగండ్ల మండలం వేముగోడుకు చెందిన భారతికి పురిటి నొప్పులు రావడంతో భర్త నల్లన్న ఆస్పత్రిలో చేర్చారు. వైద్యాధికారి నాగరాజు పర్యవేక్షణలో డాక్టర్‌ పుష్పలత ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

- కోడుమూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Jul 27 , 2025 | 05:36 AM