Central Govt: ఈ ఏడాది ఏపీకి 40 వేల కోట్లు ఇచ్చాం
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:31 AM
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 2 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.40,337 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
పోలవరానికి ఇప్పటివరకు 20 వేల కోట్లు: కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 2 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.40,337 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. సోమవారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిఅడిగిన పశ్న్రకు ఆయన సమాధానమిస్తూ.. కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.37,903 కోట్లు, ఆర్థిక సంఘం గ్రాంట్లు రూ.2,434 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం కింద రూ.3,492 కోట్లను ఏపీకి విడుదల చేశామని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.20,659 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. ఏపీకి చెల్లించాల్సిన బకాయిలు ఏమీ లేవన్నారు.