Anakapalli: 400 కిలోలు రూ.30 వేలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 06:08 AM
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక శివారు జాలరిపాలేనికి చెందిన మత్స్యకారులకు శనివారం భారీ చేప చిక్కింది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక శివారు జాలరిపాలేనికి చెందిన మత్స్యకారులకు శనివారం భారీ చేప చిక్కింది. బోట్లపై సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడి గేలానికి భారీ చేప చిక్కడంతో దానిని బోటులోకి లాగలేకపోయారు. తాడుతో కట్టి నీటిలోనే తీరానికి తీసుకువచ్చారు. దానిని ‘కితలం’ చేపగా మత్స్యకారులు చెబుతున్నారు. సుమారు 400 కిలోల బరువు ఉన్న ఈ చేపను వ్యాపారులు రూ.30 వేలకు కొనుగోలు చేశారు.
- అచ్యుతాపురం, ఆంధ్రజ్యోతి