400 కుటుంబాలు వలస
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:11 PM
కోసిగితో పాటు గౌడుగల్లు, వందగల్లు, పల్లెపాడు, మూగలదొడ్డి, చిర్తనకల్, సజ్జలగుడ్డం, జంపాపురం, ఆర్లబండ తదితర గ్రామాల నుంచి సుమారు 400 కుటుంబాలు కర్ణాటకకు వలసవెళ్లాయి.
బోసిపోతున్న గ్రామాలు
ఫ బడుల్లో తగ్గిన హాజరు శాతం
కోసిగి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): కోసిగితో పాటు గౌడుగల్లు, వందగల్లు, పల్లెపాడు, మూగలదొడ్డి, చిర్తనకల్, సజ్జలగుడ్డం, జంపాపురం, ఆర్లబండ తదితర గ్రామాల నుంచి సుమారు 400 కుటుంబాలు కర్ణాటకకు వలసవెళ్లాయి. బొలెరో, ఇతర ప్రైవేటు వాహనాల్లో తరలివెళ్లారు. ఇప్పటికే కోసిగి మండలం నుంచి వేలాది కుటుంబాలు పట్టణాలకు వలసవెళ్లారు. వలస కూలీలకు పనులు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా కూడా వారు మాత్రం స్థానికంగా ఉండటం లేదు. ఆడవారికి రూ.400, పురుషులకు రూ.600లు రోజువారి చొప్పున కూలీ ఉన్నప్పటికీ ఉపాధి హామీ కింద అధికారులు పనులు కల్పిస్తామన్నా అటుగా ఆసక్తి కనబర్చటం లేదు. ఒకరిని చూసి మరొకరు కూలీలు ఇంటికి తాళాలు వేసి వలసబాట పడుతున్నారు. దీంతో గ్రామాల్లో ఏ కాలనీ చూసినా బోసిపోతున్నాయి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరు శాతం సగానికి పైగా పడిపోయింది.