Share News

Mangalagiri: 4 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Jul 15 , 2025 | 04:59 AM

గుంటూరు ఈఎస్‌ టాస్క్‌ఫోర్స్‌, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారులు సోమవారం మంగళగిరిలో చేపట్టిన ఆకస్మిక దాడుల్లో నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Mangalagiri: 4 కిలోల గంజాయి పట్టివేత

  • మంగళగిరిలో ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ దాడులు

మంగళగిరి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): గుంటూరు ఈఎస్‌ టాస్క్‌ఫోర్స్‌, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారులు సోమవారం మంగళగిరిలో చేపట్టిన ఆకస్మిక దాడుల్లో నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కుప్పురావు కాలనీ 11వ లైను ఎన్‌సీసీ రోడ్డులో నలుగురు యువకుల వద్ద ఈ గంజాయిని పట్టుకున్నారు. నిందితుల్లో పాతమంగళగిరి భద్రావతినగర్‌కు చెందిన మునగాల సురేంద్ర, కుప్పురావు కాలనీకి చెందిన రాచకొండ చిన్నా, ఇద్దరు మైనర్లు వున్నారు. గంజాయిని ఒడిశాలోని రాయగఢ్‌ నుంచి తీసుకువచ్చి విక్రయిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. నిందితులుగా ఇద్దరు మైనర్లు తమ స్నేహితుడు బొంగులూరి రవితో కలిసి ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చినట్టు నిర్ధారించారు. రవిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసులు, సూపరింటెండెంట్‌ అరుణకుమారి ఆదేశాలతో అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఈ.మారయ్యబాబు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.

Updated Date - Jul 15 , 2025 | 05:01 AM