Share News

MSMEs Closed: వైసీపీ పాలనలో 3914 ఎంఎస్ఎంఈల మూత

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:31 AM

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో 3,914 ఎంఎ్‌సఎంఈ యూనిట్లు మూతపడినట్టు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర....

MSMEs Closed: వైసీపీ పాలనలో 3914 ఎంఎస్ఎంఈల మూత

  • పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ పాలనలో 3,914 ఎంఎ్‌సఎంఈ యూనిట్లు మూతపడినట్టు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నకు కేంద్ర ఎంఎ్‌సఎంఈ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 2020 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,21,604 ఎంఎ్‌సఎంఈ యూనిట్లు మూతపడగా, 7.22 కోట్ల కొత్త రిజిరేస్టషన్లు జరిగాయని తెలిపారు. అయితే, కేవలం నష్టాల వల్లే పరిశ్రమలు మూతపడలేదని, డూప్లికేట్‌ రిజిస్ర్టేషన్లు, యాజమాన్యాల మార్పు, ఇతర కారణాల వల్ల కూడా పోర్టల్‌లో డీ- రిజిస్టర్‌ (రద్దు) చేసుకున్నారని స్పష్టతనిచ్చారు.

Updated Date - Dec 16 , 2025 | 03:31 AM