Share News

AP Govt: జగన్‌ కక్షల నుంచి 386 మంది ఇంజనీర్లకు విముక్తి

ABN , Publish Date - Mar 12 , 2025 | 03:52 AM

నీరు-చెట్టు పథకం కింద పనులు చేసినందుకు కక్షగట్టి నాటి జగన్‌ ప్రభుత్వం చేసిన విజిలెన్స్‌ విచారణలు, వేధింపులు, క్రమశిక్షణ చర్యల...

AP Govt: జగన్‌ కక్షల నుంచి 386 మంది ఇంజనీర్లకు విముక్తి

  • నీరు-చెట్టు పనుల్లో క్రమశిక్షణ

  • చర్యలు ఉపసంహరణ

  • జలవనరుల ప్రత్యేక సీఎస్‌ ఉత్తర్వులు

  • నీరు-చెట్టు పనుల్లో క్రమశిక్షణ చర్యలు ఉపసంహరణ

అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): నీరు-చెట్టు పథకం కింద పనులు చేసినందుకు కక్షగట్టి నాటి జగన్‌ ప్రభుత్వం చేసిన విజిలెన్స్‌ విచారణలు, వేధింపులు, క్రమశిక్షణ చర్యల నుంచి 386 మంది జలవనరుల శాఖ ఇంజనీర్లకు విముక్తి లభించింది. వారిపై క్రమశిక్షణ చర్యలను నిలిపివేస్తూ ఆ శాఖ ప్రత్యేక సీఎస్‌ సాయిప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులపై 386 మంది ఇంజనీరింగ్‌ అధికారులతో పాటు జల వనరుల శాఖ, పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాల శాఖల ఇంజనీర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణారావు కూడా స్వాగతించారు.

Updated Date - Mar 12 , 2025 | 03:52 AM