Share News

Women Entrepreneurs: ఏడాదిలో 30 వేల మంది మహిళా వ్యాపారవేత్తలు

ABN , Publish Date - Jul 16 , 2025 | 04:40 AM

రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా శక్తిమంతులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం.

Women Entrepreneurs: ఏడాదిలో 30 వేల మంది మహిళా వ్యాపారవేత్తలు

  • మెప్మా వర్క్‌షాపులో ముఖ్య కార్యదర్శి సురేశ్‌ కుమార్‌

అమరావతి, తాడేపల్లి టౌన్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా శక్తిమంతులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ ఆర్థిక సంవత్సరంలో 30 వేల మందిని వ్యాపారవేత్తలుగా చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు’ అని మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన మెప్మా రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ‘మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎల్‌ఈఏపీ (లీప్‌) కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది’ అని తెలిపారు.

Updated Date - Jul 16 , 2025 | 04:43 AM