Share News

Minister Lokesh: 282.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం

ABN , Publish Date - Oct 14 , 2025 | 06:16 AM

ఐటీ రంగంలో 282.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి లక్ష్యంగా, యువతకు ఉపాధి కల్పించేందుకు వీలుగా మంత్రి లోకేశ్‌ నేతృత్వంలో 16 మందితో కూడిన రాష్ట్రస్థాయి అత్యున్నత కౌన్సిల్‌ను...

Minister Lokesh: 282.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం

  • ఐటీలో అత్యున్నత అడ్వయిజరీ కౌన్సిల్‌

  • మంత్రి లోకేశ్‌ నేతృత్వంలో ఏర్పాటు

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఐటీ రంగంలో 282.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి లక్ష్యంగా, యువతకు ఉపాధి కల్పించేందుకు వీలుగా మంత్రి లోకేశ్‌ నేతృత్వంలో 16 మందితో కూడిన రాష్ట్రస్థాయి అత్యున్నత కౌన్సిల్‌ను ప్రభుత్వం ఏర్పా టు చేసింది. ఈ మేరకు సోమవారం ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ ఉత్తర్వు జారీ చేశారు. జాతీయ స్థాయిలో ప్రఖ్యాత ఐటీ కంపెనీలలైన ఇండియా అండ్‌ సార్క్‌ సియానా డైరెక్టర్‌ సుజిత్‌ బాబు, ఇన్ఫోసిస్‌, ఫైనాన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌కుమార్‌, ఐబీఎం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నందిని సింగ్‌, కాగ్నిజెంట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ గౌరవ్‌ హజారా, టీసీఎస్‌, రీజియన్‌ హెడ్‌ ఎం.రవి భావరాజు, ఐటీ డెవల్‌పమెంట్‌ సెంటర్స్‌ హెడ్స్‌ విభాగంలో సిస్టమ్స్‌ పెర్సిస్టెంట్‌ సిస్టమ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విష్ణు మామిడిపల్లి, కోవర్కింగ్‌ స్పేస్‌ విభాగంలో వి-వర్క్‌ సీఈవో విశ్వని, ఇండిక్యూట్‌ చైర్మన్‌ రిషి దాస్‌, 91 స్ర్పింగ్‌ బోర్డు సీఓఓ సమీర్‌ సింగ్‌, నాస్కామ్‌, నాస్కమ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంగీతా గుప్త, సీఐఐ ఏపీ చైర్మన్‌ మురళీకృష్ణ, ఆక్వా ఎక్స్చేంజ్‌ అగ్రిటెక్‌ సీఈవో పవర్‌ కృష్ణ, ఆర్‌అండ్‌డీ విభాగంలో నాస్కమ్‌ సీఈవో సంజీవ్‌ మల్హోత్ర, కాటమనేని భాస్కర్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్‌ ఇందులో ఉన్నారు.


మెగా డీఎస్సీ మాట నిలబెట్టుకున్నాం: లోకేశ్‌

అడ్డంకులు ఎదురైనా, ఆటంకాలు సృష్టించినా మెగా డీఎస్సీ మాట నిలబెట్టుకున్నామని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. మెగా డీఎస్సీ టీచర్లు సోమవారం నుంచి విధుల్లోకి వస్తున్న సందర్భంగా ఆయన ఎక్స్‌ వేదికగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న లక్షలాది మంది టీచర్లకు.. ఇప్పుడు కొత్తగా మరో 16వేల మంది కొత్త టీచర్లు తోడవుతున్నారు. అంతాకలిసి విద్యార్థుల సమగ్ర వికాసాన్ని గురుతర బాధ్యతగా నిర్వర్తించాలి’ అని లోకేశ్‌ ఆకాక్షించారు.

Updated Date - Oct 14 , 2025 | 06:43 AM