MSME Incentives: 2,536 ఎంఎస్ఎంఈలకు 275 కోట్ల ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:46 AM
పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రోత్సాహకాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా రాష్ట్రంలోని 2,536 ఎంఎస్ఎంఈ...
అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రోత్సాహకాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా రాష్ట్రంలోని 2,536 ఎంఎస్ఎంఈ(మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్) యూనిట్లకు రూ.275.47 కోట్ల నిధుల విడుదలకు అనుమతిచ్చింది. 182 భారీ, మెగా పరిశ్రమలకు రూ.694.44 కోట్లు, పరిశ్రమల శాఖలో 306 బస్సుల కోసం రూ.56 కోట్లు, డిపార్ట్‌మెంటల్ విజిలెన్స్ కేసుల పరిష్కారం కోసం రూ.39 కోట్లు కలిపి మొత్తం రూ.1,030.95 కోట్ల నిధులను పారిశ్రామిక ప్రోత్సాహకాలుగా అందించనుంది. ఈ నిధుల విడుదలకు సంబంధించి పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్లు, జిల్లా పరిశ్రమల కేంద్రాల అధికారులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.