Share News

లోక్‌ అదాలతలో 2,452 కేసులు పరిష్కారం

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:32 PM

జాతీయ లోక్‌ అదాలతలో 2,452 కేసులు పరిష్కారం అయినట్లు మూడో అదనపు జిల్లా న్యాయాధికారి, లోక్‌ అదాలత చైర్మన అమ్మన్నరాజా అన్నారు.

    లోక్‌ అదాలతలో 2,452 కేసులు పరిష్కారం
లోక్‌ అదాలత నిర్వహిస్తున్న దృశ్యం

మూడవ అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా

నంద్యాల క్రైం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జాతీయ లోక్‌ అదాలతలో 2,452 కేసులు పరిష్కారం అయినట్లు మూడో అదనపు జిల్లా న్యాయాధికారి, లోక్‌ అదాలత చైర్మన అమ్మన్నరాజా అన్నారు. శనివారం నంద్యాల న్యాయస్థానాల ఆవరణంలో ఈ కార్యక్రమానికి నిర్వహించారు. ప్రిన్సిపల్‌ సీనియర్‌, జూనియర్‌ సివిల్‌ న్యాయాధి కారులు తంగమణి, లక్ష్మీ, స్పెషల్‌ క్లాస్‌ న్యాయాధికారి ఏసురత్నం పాల్గొని పలు కేసులను పరిష్కరించారు. ఈసందర్భంగా అమ్మన్నరాజా మాట్లాడుతూ ఈలోక్‌ అదాలతలో మోటార్‌ వాహన ప్రమాద కేసులు అధికంగా పరిష్కారమయ్యాయని వివరించారు. మోటార్‌ వెహికిల్‌ కేసులతో పాటు డీవీసీ, ఎక్సైజ్‌, బ్యాంక్‌లు తదితర 2,452 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించారన్నారు. 2019లో రోడ్డు ప్రమా దంలో మృతిచెందిన వైద్యవిద్యార్థి కుటుంబానికి బజాజ్‌ అలయన్స బీమా కంపెనీ ద్వారా రూ.50లక్షల పరిహారాన్ని న్యాయాధికారులు బాధిత కుటుంబానికి అందజే శారు. రాజీ కాగల్గిన కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, పోలీసులు, బ్యాంక్‌, బీమా అధికారులు సమన్వయంతో కృషిచేస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాది తులసిరెడ్డి, న్యాయవాదులు మద్దిలేటిస్వామి, హుశ్శేనభాష, విజయశేఖర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సుబ్బారాయుడు, ద్వారకానాధ్‌, బోయసుబ్బారెడ్డి, నటరాజ్‌, ఓబుళరెడ్డి, లోక్‌అదాలత సిబ్బంది భాస్కర్‌, రామచంద్రారెడ్డి, బ్యాంక్‌ , బీమా, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 11:32 PM