పీఎం విశ్వకర్మ ద్వారా 237 కోట్ల రుణాలు: లంకా
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:06 AM
చేతివృత్తులను వంశపారంపర్యంగా స్వీకరించి, వాటినే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న వారందరికీ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్....
అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): చేతివృత్తులను వంశపారంపర్యంగా స్వీకరించి, వాటినే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న వారందరికీ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన మాట్లాడారు. విశ్వకర్మ జయంతిని అన్ని జిల్లాల్లో అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద 31 వేల మందికి రూ.237 కోట్ల మేర రుణాలు అందజేసినట్లు తెలిపారు. వాగ్గేయకారుడు త్యాగయ్య జన్మించిన ప్రకాశం జిల్లా, కాకర్లలో ఆయన పేరిట ఆడిటోరియాన్ని టీటీడీ ద్వారా నిర్మించనున్నట్టు తెలిపారు.