Share News

23 మంది బెస్ట్‌ టీచర్లు

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:50 AM

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 23 మంది ఉపాధ్యాయులకు ఈ నెల 5వ తేదీన జిల్లా పరిషత సమావేశపు హాలులో బెస్ట్‌ టీచర్‌ అవార్డులు అందించనున్నట్టు డీఈవో పి.వి.జె.రామారావు తెలిపారు. వివిధ మండలాలకు చెందిన స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, ప్రధానోపాధ్యాయులను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.

23 మంది బెస్ట్‌ టీచర్లు

- జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితా విడుదల

- వివరాలు వెల్లడించిన డీఈవో రామారావు

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి):

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 23 మంది ఉపాధ్యాయులకు ఈ నెల 5వ తేదీన జిల్లా పరిషత సమావేశపు హాలులో బెస్ట్‌ టీచర్‌ అవార్డులు అందించనున్నట్టు డీఈవో పి.వి.జె.రామారావు తెలిపారు. వివిధ మండలాలకు చెందిన స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, ప్రధానోపాధ్యాయులను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవంలో గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్‌ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ బాలాజీ పాల్గొంటారని తెలిపారు.

అవార్డు గ్రహీతలు వీరే...

బందరు మండలం పోతేపల్లి జిల్లా పరిషత హైస్కూల్‌ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ మల్లవోలు దుర్గాశ్రీలక్ష్మి, గన్నవరం మండలం వెదురుపావులూరు ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ దొప్పాల జెన్నీస్‌, కోడూరు మండలం స్వతంత్రపురం మండల పరిషత ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ కారాని నాగార్జున, తోట్లవల్లూరు మండలం కలాశ దళితవాడ మండల పరిషత ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఎన్‌. చినచింతయ్య, గన్నవరం మండలం దావాజీగూడెం మోడల్‌ ప్రైమరీ పాఠశాల ఎస్‌జీటీ రేమల్లి రత్నకుమారి, బాపులపాడు మండలం రంగన్నగూడెం మండల పరిషత ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ బండ్లపల్లి నాగరాజు, అంగలూరు ప్రభుత్వ బాలికల పాఠశాల పీఈటీ గొడవర్తి నెర్సిరోజమ్మ, కంకిపాడు మండలం ఉప్పులూరు మండల పరిషత యూపీ పాఠశాల సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ చిరువోలులంక నాగమల్లేశ్వరి, గుడ్లవల్లేరు మండలం మండల ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీ ఏ.వి.వరలక్ష్మి, గుడ్లవల్లేరు మండలం చందర్ల ఎంపీయూపీ పాఠశాల ఎస్‌జీటీ కె.రత్నం, కోడూరు మండలం లింగారెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీ తక్కెళ్ల నాగమణి, గుడ్లవల్లేరు మండలం పెదపాలెం ఎంపీయూపీ పాఠశాల ఎస్‌జీటీ తలశిల సురేష్‌, గుడివాడ ఏకెటిపి బాలికల ఉన్నత పాఠశాల పీఎస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ మల్లవల్లి అమ్మన్నబాబు, గుడివాడ ఎస్‌వీఎస్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ బయోలాజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ మండవ శ్రీలక్ష్మి, గన్నవరం మండలం వీరపనేనిగూడెం మండల పరిషత ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాదగాని సరళ, కోడూరు మండలం స్వతంత్రపురం జిల్లా పరిషత హైస్కూల్‌ సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ కె.మదన్‌మోహనరావు, నాగాయలంక జిల్లా పరిషత హైస్కూల్‌ ఇంగ్లీషు స్కూల్‌ అసిస్టెంట్‌ అరవ సుజాత, కంకిపాడు మండలం ఈడుపుగల్లు జిల్లా పరిషత హైస్కూల్‌ హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌ కూచి ప్రమీలారాణి, గుడివాడ గాంధీ మునిసిపల్‌ హైస్కూల్‌ ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ లోయ అనంతలక్ష్మి, మచిలీపట్నం మండలం బుద్దాలపాలెం జిల్లా పరిషత హైస్కూల్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పెద్ది దుర్గా భవాని, గన్నవరం మండలం మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు కొమెర కుమారబాబు, పమిడిముక్కల మండలం అలినక్కిపాలెం మండల పరిషత యూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మిర్జా నవజీష్‌ హుస్సేన్‌, ఉంగుటూరు మండలం వేలుపాడు జిల్లా పరిషత హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడడు తిమ్మరాజు సీతారామ్‌ జిల్లా ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు.

Updated Date - Sep 04 , 2025 | 12:50 AM