Share News

Minister Satyakumar: 227 మంది స్పెషలిస్టులకు పోస్టింగ్‌

ABN , Publish Date - Nov 10 , 2025 | 04:14 AM

ప్రభుత్వ వైద్య సేవల్ని అందించడంలో కీలక పాత్ర వహించే సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత తీర్చడంలో భాగంగా 227 మంది పీజీ పూర్తి చేసిన వైద్యులకు....

Minister Satyakumar: 227 మంది స్పెషలిస్టులకు పోస్టింగ్‌

  • సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో నియామకం: మంత్రి సత్యకుమార్‌

అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య సేవల్ని అందించడంలో కీలక పాత్ర వహించే సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత తీర్చడంలో భాగంగా 227 మంది పీజీ పూర్తి చేసిన వైద్యులకు పోస్టింగ్‌లు ఇచ్చామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. ఇన్‌సర్వీస్‌ కోటాలో 12 విభాగాల్లో పీజీ చేసిన 227 మందిని 142 సెకండరీ ఆస్పత్రులకు కేటాయించామన్నారు. త్వరలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లకు 155 మంది స్పెషలిస్టులు, 100 పీహెచ్‌సీల్లో 155 మంది స్పెషలిస్ట్‌ వైద్యులు విధుల్లో చేరతారన్నారు. 33 ఏరియా ఆస్పత్రుల్లో 60 మంది, ఏడు జిల్లా ఆస్పత్రుల్లో 10 మంది, 2 ఎంసీహెచ్‌ ఆస్పత్రుల్లో ఇద్దరు స్పెషలిస్టు వైద్యులకు కౌన్సెలింగ్‌ ద్వారా పోస్టింగ్‌లు ఇచ్చామని తెలిపారు. మొత్తంగా 227 మందిలో 35 మంది చొప్పున గైనకాలజిస్టులు, జనరల్‌ మెడిసిన్‌ స్పెషలి్‌స్టలు, 30 మంది జనరల్‌ సర్జరీ వైద్యులు, 26 మంది మత్తు వైద్యులు, 25 మంది పిల్లల వైద్య నిపుణులు, 18 మంది ఎముకల వైద్యులు, 17 మంది రేడియాలజిస్టులు, 15 మంది కంటి వైద్య నిపుణులు, 9 మంది ఈఎన్‌టీ స్పెషలిస్టులు సెకండరీ ఆస్పత్రుల్లో సేవలందిస్తారని చెప్పారు. మొత్తం 243 సెకండరీ ఆస్పత్రులుండగా 142 ఆస్పత్రుల్లో 227 మంది స్పెషలిస్టులు నియమితులయ్యారు. అత్యధికంగా గూడూరు ఏరియా ఆస్పత్రికి నలుగురు స్పెషలిస్టుల్ని కేటాయించారు. వీరిలో పిల్లల వైద్యుడు, రేడియాలజిస్ట్‌, చర్మవ్యాధి నిపుణుడు, పాథాలజిస్ట్‌ ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. 2022-23లో ఇన్‌ సర్వీసు డాక్టర్లుగా వివిధ పీజీ కోర్సుల్లో చేరిన 257 మంది పీహెచ్‌సీ వైద్యులు.. తాజాగా తమ కోర్సులు పూర్తి చేయగా, వారిలో 227 మందిని సెకండరీ ఆస్పత్రుల్లో నియమించామని, తగిన ఖాళీలు లేనందున మిగిలిన 30 మందిని డీఎంఈ ఆస్పత్రుల్లో ట్యూటర్లుగా అవకాశం కల్పించామని తెలిపారు. ఈ మేరకు పోస్టింగ్‌ల వివరాలను మంత్రి సత్యకుమార్‌కు సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ చక్రధర్‌బాబు, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డా.పద్మావతి వివరించారు.

Updated Date - Nov 10 , 2025 | 04:14 AM