Srikakulam: 22 నెలలకే.. 15 శ్లోకాలు..
ABN , Publish Date - Oct 18 , 2025 | 06:33 AM
పిట్ట కొంచెం.. కూత ఘనం’ అనే నానుడి ఈ చిన్నారికి అతికినట్టు సరిపోతుంది..! పెద్దవాళ్లు సైతం గుర్తుంచుకోలేని సంస్కృత శ్లోకాలను రెండేళ్లు కూడా నిండని చిన్నారి అలవోకగా చెప్పేసి...
అదరగొట్టిన శ్రీకాకుళం చిన్నారి మయూరి‘
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ సొంతం
పలాస రూరల్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అనే నానుడి ఈ చిన్నారికి అతికినట్టు సరిపోతుంది..! పెద్దవాళ్లు సైతం గుర్తుంచుకోలేని సంస్కృత శ్లోకాలను రెండేళ్లు కూడా నిండని చిన్నారి అలవోకగా చెప్పేసి ‘నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ను సొంతం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గకు చెందిన సీర సంజీవ్, డాక్టర్ వడిశ శాంతిల కుమార్తె పేరు మయూరి. వయసు 22 నెలలు. వృత్తిరీత్యా తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. సాఽధారణంగా రెండేళ్లు కూడా నిండని పిల్లలు ఆటపాటలతో అల్లరి చేస్తుంటారు. కానీ మయూరి సంస్కృత శ్లోకాలు, పద్యాలను ఇష్టంగా పాడేది. ఆమెలోని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు శ్లోకాల పఠనంలో తర్ఫీదునిచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 15 శ్లోకాలు వినిపించిన మయూరి.. అత్యంత పిన్నవయసులో ఈ ఘనత సాధించినందుకుగానూ నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. దీంతో పాటు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ ఆమె పేరు నమోదైంది. ఇటీవల ఈ చిన్నారికి నిర్వాహకులు ధ్రువపత్రాన్ని అందించారు.