Share News

APSRTC: రోజుకు 21 లక్షల మంది ఉచిత ప్రయాణం

ABN , Publish Date - Aug 23 , 2025 | 06:43 AM

రాష్ట్రంలో స్ర్తీ శక్తి పథకం ద్వారా ప్రతి రోజూ 21 లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని పొందుతున్నారని ఏపీఎస్ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

APSRTC: రోజుకు 21 లక్షల మంది ఉచిత ప్రయాణం

  • త్వరలో 1050 ఈ-బస్సులు, 1500 బస్సుల కొనుగోలు: ఆర్టీసీ ఎండీ

పొన్నూరుటౌన్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్ర్తీ శక్తి పథకం ద్వారా ప్రతి రోజూ 21 లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని పొందుతున్నారని ఏపీఎస్ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఆర్టీసీ డిపోను శుక్రవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌తో కలిసి సందర్శించారు. డిపోలోని సమస్యలపై ఆరా తీసి సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. స్ర్తీ శక్తి పథకంలో ప్రస్తుతం 60 శాతం మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. నష్టం వచ్చినా ప్రభుత్వ లక్ష్యాలను అందుకునేలా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. త్వరలో 1050 ఎలక్ర్టికల్‌ బస్సులు రానున్నాయన్నారు. మరో 1500 బస్సులు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 1500 మందిని కారుణ్య నియామకాల కింద నియమించుకున్నామన్నారు. పెన్షను సైతం పెంచామని తెలిపారు.

Updated Date - Aug 23 , 2025 | 06:44 AM