Share News

Cannabis Seizure: శ్రీకాకుళం జిల్లాలో 209 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Oct 17 , 2025 | 06:06 AM

శ్రీకాకుళం జిల్లాలో భారీస్థాయిలో గంజాయిని పోలీసుల ఆధ్వర్యంలో ఈగల్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుంది.

Cannabis Seizure: శ్రీకాకుళం జిల్లాలో 209 కిలోల గంజాయి స్వాధీనం

శ్రీకాకుళం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో భారీస్థాయిలో గంజాయిని పోలీసుల ఆధ్వర్యంలో ఈగల్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుంది. ఎస్పీ మహేశ్వరరెడ్డి కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజయాబాద్‌కు చెందిన సునీల్‌, మేరఠ్‌కు చెందిన విశాల్‌.. ఒడిశా రాష్ట్రంలో 209 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దానిని ప్యాకెట్ల రూపంలో కారులో ఉత్తరప్రదేశ్‌కు రవాణా చేస్తుండగా.. శ్రీకాకుళం జిల్లా పొందూరు-చిలకపాలెం మధ్య పోలీసులకు పట్టుబడ్డారు. వారిద్దరినీ అరెస్టు చేసి.. గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.

Updated Date - Oct 17 , 2025 | 06:07 AM