Share News

Meat and Alcohol Seized: శ్రీశైలంలో 200 కిలోల మాంసం పట్టివేత

ABN , Publish Date - Dec 26 , 2025 | 04:37 AM

శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రంగా పేరొందిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం సమీపంలో 200 కిలోల మాంసం, భారీగా మద్యం పట్టుబడింది..

Meat and Alcohol Seized: శ్రీశైలంలో 200 కిలోల మాంసం పట్టివేత

  • భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం

శ్రీశైలం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రంగా పేరొందిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం సమీపంలో 200 కిలోల మాంసం, భారీగా మద్యం పట్టుబడింది. క్రిస్మస్‌ వేడుకల కోసం తరలిస్తుండగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీశైలం టోల్‌గేట్‌ వద్ద భారీ మొత్తంలో మాంసం, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రామాంజినాయక్‌ వెల్లడించారు. శ్రీశైలానికి చెందిన రవి, విలియం, రాజు, సుబ్బయ్య కలిసి సున్నిపెంట నుంచి మూడు స్కూటీలు, ఒక బైక్‌పై క్షేత్రానికి 200 కిలోల కోడి మాంసంతో పాటు మద్యం బాటిళ్లను తీసుకుని శ్రీశైలానికి అతి సమీపంలోని టోల్‌గేట్‌ వద్దకు వచ్చారు. అక్కడ సెక్యురిటీ సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకుని వెళ్లేందుకు యత్నించారు. అనుమానం వచ్చిన సిబ్బంది వారిని అడ్డుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. మద్యం, మాంసాన్ని స్వాఽధీనం చేసుకున్న సీఎ్‌సఓ శ్రీనివాసరావు, నలుగురినీ పోలీసులకు అప్పగించారు. వన్యమృగాలు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసుల సమక్షంలో సెక్యూరిటీ సిబ్బంది టోల్‌గేట్‌కు దూరంగా మాంసాన్ని పూడ్చిపెట్టారు. అదే విధంగా మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. క్షేత్ర వైభవానికి, భక్తుల మనోభావాలకు భంగం కలిగించేలా ఎవరూ పాల్పడవద్దని డీఎస్పీ రామాంజినాయక్‌, సీఎ్‌సఓ శ్రీనివాసరావు కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై దేవదాయ శాఖ తరపున కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Dec 26 , 2025 | 04:37 AM