Seethampeta: 16 అడుగుల కింగ్ కోబ్రా
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:58 AM
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 16 అడుగుల భారీ కింగ్‌కోబ్రా కలకలం రేపింది. ఇక్కడి శ్రీకోటదుర్గ వననర్సరీ ఫాంలో సోమవారం ఇది కనిపించడంతో...
సీతంపేట రూరల్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 16 అడుగుల భారీ కింగ్‌కోబ్రా కలకలం రేపింది. ఇక్కడి శ్రీకోటదుర్గ వననర్సరీ ఫాంలో సోమవారం ఇది కనిపించడంతో ఫాం యజమాని భుజంగరావు శ్రీకాకుళంలోని స్నేక్‌క్యాచర్, అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్నేక్‌క్యాచర్ షేక్ అబ్దుల్‌ఖాన్, సహాయకుడు అశోక్‌కుమార్ అక్కడికి వచ్చి కింగ్‌కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దాన్ని సీతంపేట ఏజెన్సీలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు. సీతంపేట ఏజెన్సీలో ఇంత పెద్ద కింగ్‌కోబ్రాను చూడటం ఇదే మొదటిసారని కొత్తూరు ఫారెస్ట్ బీట్ అధికారి దాలినాయుడు తెలిపారు. చాలా విషపూరితమని, కాటువేస్తే నిమిషాల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు.