Share News

Fund Released: పంచాయతీలకు 1,120 కోట్లు విడుదల

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:42 AM

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లను విడుదల చేస్తూ ఆర్థికశాఖ చర్యలు తీసుకుంది.

Fund Released: పంచాయతీలకు 1,120 కోట్లు విడుదల

అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లను విడుదల చేస్తూ ఆర్థికశాఖ చర్యలు తీసుకుంది. గత నెల 26న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన చేస్తూ... ‘15వ ఆర్థిక సంఘం నిధులు సెప్టెంబరు మొదటి వారంలో విడుదలవుతాయి. సీఎం చంద్రబాబు ఆ మేరకు హామీ ఇచ్చారు’ అని తెలిపారు. దానికి కార్యరూపం ఇస్తూ... ఆర్థిక శాఖ నిధులను విడుదల చేసింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రామ పంచాయతీలకు ఈ నిధుల విడుదల ఊరటనివ్వనుంది.

Updated Date - Sep 03 , 2025 | 03:44 AM