Deputy CM Pawan Kalyan: పంచాయతీలకు రూ.1,120 కోట్లు
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:36 AM
గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను సెప్టెంబరు మొదటి వారంలో విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్...
సెప్టెంబరు మొదటి వారంలో విడుదల
ఆర్థిక సంఘం నిధులపై సీఎం హామీ
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడి
అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను సెప్టెంబరు మొదటి వారంలో విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిధులను సకాలంలో విడుదల చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీల అభివృద్ధికి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. ఈ నిధుల అంశంపై ఈనెల 15న పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని సర్పంచులు సంప్రదించారని, పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు సెప్టెంబరు మొదటి వారం నాటికి అన్ని పంచాయతీలకు విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.