Forest Department: 11 మంది ఐఎఫ్ఎస్‌ల బదిలీ
ABN , Publish Date - Sep 12 , 2025 | 06:00 AM
అటవీశాఖ అనుబంధ విభాగాల్లోని 11 మంది ఐఎ్‌ఫఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): అటవీశాఖ అనుబంధ విభాగాల్లోని 11 మంది ఐఎ్‌ఫఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులు... ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డీసీ) ఎండీ రాజేంద్రప్రసాద్ ఖజురియాను ఏపీ పర్యావరణ నిర్వహణ సంస్థ ఎండీగా, పీసీసీఎఫ్ (విజిలెన్స్ అండ్ అడ్మినిస్ర్టేషన్) ఎస్‌ఎస్ శ్రీధర్‌ను అటవీ అభివృద్ధి సంస్థ ఎండీగా, అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ శ్రీశరవణన్‌ను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా నియమించారు. పీసీసీఎఫ్ ఆఫీస్‌లోని సీసీఎఫ్ ఎస్ శ్రీకంఠనాథరెడ్డి ఎఫ్‌డీసీ రాజమండ్రి రీజనల్ మేనేజర్‌గా, రాజమండ్రిలోని ఏపీ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ బీ విజయకుమార్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్‌గా, ఇక్కడున్న బీవీఏ కృష్ణమూర్తి కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారె్‌స్టగా బదిలీ అయ్యారు. ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడెమీ(ఐజీఎన్‌ఎ్‌ఫఏ)లో శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఎం బబిత, తిరుపతి బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌లోని వృక్షసంపద శాస్త్రవేత్తగా, ఇప్పటి వరకు అక్కడున్న జీజీ నరేంద్రన్ పీసీసీఎఫ్ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ కన్జర్వేటర్(ప్రొడక్షన్)గా బదిలీ అయ్యారు. ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ వీ సాయిబాబాకు తిరుపతి జిల్లా అటవీ అధికారిగా పోస్టింగ్ ఇచ్చి, అక్కడున్న పీ వివేక్‌ను ఎఫ్‌డీసీ నెల్లూరు రీజనల్ మేనేజర్‌గా బదిలీ చేశారు. అనంతపురం జిల్లా అటవీ అధికారి విఘ్నేశ్ అప్పావును ఆత్మకూరు ఎన్‌ఎస్‌టీఆర్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు.