Share News

Farmers Welfare Scheme: అన్నదాత సుఖీభవ గ్రీవెన్స్‌కు 10,915 దరఖాస్తులు

ABN , Publish Date - Aug 09 , 2025 | 05:04 AM

అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉండి, వివిధ కారణాలతో లబ్ధి చేకూరని రైతుల కోసం వ్యవసాయశాఖ చేపట్టిన గ్రీవెన్స్‌కు ఈ నెల3-8 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 10,915 మంది...

Farmers Welfare Scheme: అన్నదాత సుఖీభవ గ్రీవెన్స్‌కు 10,915 దరఖాస్తులు

అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అర్హత ఉండి, వివిధ కారణాలతో లబ్ధి చేకూరని రైతుల కోసం వ్యవసాయశాఖ చేపట్టిన గ్రీవెన్స్‌కు ఈ నెల3-8 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 10,915 మంది దరఖాస్తు చేశారు. గరిష్ఠంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 1,290, విజయనగరం జిల్లా నుంచి 1,111 దరఖాస్తులు రాగా, మిగిలిన 24 జిల్లాల నుంచి వెయ్యిలోపు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో మండల వ్యవసాయ అధికారి పరిధిలో 5,377 ఆమోదించగా, 4,261 పెండింగ్‌లో పెట్టి, 29 తిరస్కరించారు. తహసీల్దార్‌ పరిధిలో 827 పెండింగ్‌లో ఉండగా, 411 ఆమోదించి, 10 దరఖాస్తుల్ని తిరస్కరించారు. గ్రీవెన్స్‌లో పరిష్కారమై, ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అర్హత ఉన్న రైతులకు త్వరలో నిధులు విడుదలవుతాయని అధికారులు తెలిపారు.

Updated Date - Aug 09 , 2025 | 05:06 AM