వందశాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:04 AM
ప దవతరగతి విద్యా ర్థులకు వందరోజుల యాక్షనప్లాన అమ లు చేసి వందశా తం ఉత్తీర్ణత సాధిం చేందుకు ఉపాధ్యా యులు కృషి చేయాలని డీఈవో జనార్దనరెడ్డి అన్నారు.
జూపాడుబంగ్లా, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప దవతరగతి విద్యా ర్థులకు వందరోజుల యాక్షనప్లాన అమ లు చేసి వందశా తం ఉత్తీర్ణత సాధిం చేందుకు ఉపాధ్యా యులు కృషి చేయాలని డీఈవో జనార్దనరెడ్డి అన్నారు. మంగళ వా రం మండలంలోని మండ్లెం జిల్లాపరిషత్తు ఉన్నతపాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. స్టడీ అవర్స్, స్లిప్‌టెస్టులు నిర్వహిస్తున్నారా? లేదా.. అంటూ వి ద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 10వతరగతి విద్యార్థులు గైర్హాజరైతే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి రెగ్యులర్‌గా పాఠశాలకు వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం హాజరుపట్టీని పరిశీలించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.