BC Welfare Minister Savita: 100 మందికి ఉచితంగా సివిల్స్ కోచింగ్
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:06 AM
ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్‌కు 100 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపారు...
ఆదరణ-3పై త్వరలో నిర్ణయం: మంత్రి సవిత వెల్లడి
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్‌కు 100 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కో అభ్యర్థికి కోచింగ్, భోజన, వసతి సదుపాయాలకు రూ.85 వేల వరకు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారి సర్టిఫికెట్లను ఈ నెల 12న విజయవాడ గొల్లపూడిలోని బీసీ స్టడీ సర్కిల్‌లో పరిశీలిస్తామని, 14 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.