Share News

బండ్ల గణేష్ నుంచి మాకు ప్రాణహాని ఉంది.. నౌహీరా షేక్ సంచలనం

ABN , Publish Date - Feb 17 , 2024 | 09:34 PM

తమకు నిర్మాత బండ్ల గణేష్ నుంచి ప్రాణహాని ఉందని హీరా గోల్డ్ సంస్థల ఎండీ నౌహీరా షేక్ ఫిర్యాదు చేశారు. తమకు ఏమైనా అయితే, అందుకు బండ్ల గణేష్ బాధ్యత అని ఆమె కుండబద్దలు కొట్టారు. ఆయన తనపై దాడి చేశాడని, కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు చెప్పి తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు.

బండ్ల గణేష్ నుంచి మాకు ప్రాణహాని ఉంది.. నౌహీరా షేక్ సంచలనం

తమకు నిర్మాత బండ్ల గణేష్ నుంచి ప్రాణహాని ఉందని హీరా గోల్డ్ సంస్థల ఎండీ నౌహీరా షేక్ ఫిర్యాదు చేశారు. తమకు ఏమైనా అయితే, అందుకు బండ్ల గణేష్ బాధ్యత అని ఆమె కుండబద్దలు కొట్టారు. ఆయన తనపై దాడి చేశాడని, కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు చెప్పి తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. తాను ఇచ్చిన ఫిర్యాదుని కూడా పోలీసులు తీసుకోవడం లేదని వాపోయారు. బండ్ల గణేష్ ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలపై పోలీసులు దృష్టి పెట్టాలని ఆమె కోరారు. అతను 14 భూములను కబ్జా చేశాడని, అతని బాధితులు 140 మంది వరకు ఉన్నారని చెప్పారు. తమ ఇల్లు కొనాలంటే ఈడీ అనుమతి తప్పనిసరి అని చెప్పిన నౌహీరా.. తమ ఇంటిని చూపిస్తూ బండ్ల గణేష్ హోంటూర్ చేసి యూట్యూబ్‌లో వీడియో పెట్టాడని పేర్కొన్నారు.


మరోవైపు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కస్టడీలో ఉన్న ఇంటిని మోసపూరితంగా విక్రయించే యత్నంతో పాటు తన వద్ద నుంచి తీసుకొని మరీ ఇంటిని ఖాళీ చేయాలంటూ రౌడీలతో దౌర్జన్యానికి దిగిందంటూ నౌహీరా షేక్‌పై బండ్ల గణేష్‌ కొడుకు బండ్ల హీరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిలింనగర్‌ రోడ్డు నెంబర్‌.13 సైట్‌.2లో ఉన్న ప్లాట్ నంబర్.15-ఏలో ఆమెకు చెందిన ఇంట్లో తాను 2023 నుంచి అద్దెకు ఉంటున్నానని, ఆ ఇంటిని అమ్ముతున్నట్టు చెప్పడంతో తామే దాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి గతేడాది మార్చి 23న ఆమెకు రూ.3 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చానని అన్నాడు. మిగతా డబ్బులను జమ చేస్తున్న సమయంలో ఈ ఇల్లు ఈడీ కేసులో ఉందని తనకు తెలిసిందని చెప్పాడు. దాంతో తాను అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బులను తిరిగివ్వాలని కోరగా.. అందుకు భిన్నంగా మిగతా డబ్బులు కూడా చెల్లించాలని నౌహీరా తమపై ఒత్తడి చేస్తుందని ఆరోపించాడు.

ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం సమయంలో నౌహీరా షేక్ 10 మంది రౌడీలతో కలిసి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని.. అంతేకాకుండా ఇంటిని ఖాళీ చేయమంటూ బెదిరింపులకు పాల్పడిందని బండ్ల హీరేష్ తన ఫిర్యాదులో తెలిపాడు. అసభ్య పదజాలంతోనూ తనని దూషించిందని చెప్పాడు. దీంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలావుండగా.. హీరో గోల్డ్‌ రూ. 5వేల కోట్ల కుంభకోణంపై మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఆమెకు చెందిన భూములను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఏ ఇంటిపై రగడ జరుగుతోందో, ఆ ఇల్లు కూడా ఈ కేసులో ఉంది. ఈ విషయం మీదే బండ్ల ఫ్యామిలీ, నౌహీరా షేక్ మధ్య వివాదం రాజుకుంది.

Updated Date - Feb 17 , 2024 | 09:34 PM