Share News

IPL 2024: 13 ఓవర్లు పూర్తి.. 7 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్!

ABN , Publish Date - May 26 , 2024 | 08:42 PM

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు కోల్‌కతా బౌలర్లు భారీ షాకిచ్చారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ 12.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 77 పరుగులు మాత్రమే చేసింది.

IPL 2024: 13 ఓవర్లు పూర్తి.. 7 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్!
IPL 2024 Final

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఫైనల్ (IPL 2024) మ్యాచ్ జరుగుతోంది (SRH VS KKR). టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు కోల్‌కతా బౌలర్లు భారీ షాకిచ్చారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ 12.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 77 పరుగులు మాత్రమే చేసింది.


బౌలింగ్‌కు అనుకూలిస్తున్న చెపాక్ పిచ్‌‌పై హైదరాబాద్ బ్యాటర్లు క్రీజులో నిలబడడానికే తడబడ్డారు. అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0), రాహుల్ త్రిపాఠి (9), నితీష్ రెడ్డి (13), ఆదెల్ మార్‌‌క్రమ్ (20), షాబాజ్ అహ్మద్ (8), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. ఎవరూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే భాగస్వామ్యం నమోదు చేయలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో స్టార్క్ 2, రస్సెల్ 2, అరోరా, హర్షిత్, వరుణ్ చక్రవర్తి, తలో వికెట్ తీశారు. హైదరాబాద్ బ్యాటర్లు కనీసం 100ర పరుగులు పూర్తి చేయగలరా అనేది అనుమానంగా మారింది.

Updated Date - May 26 , 2024 | 08:42 PM