Share News

జిడ్డు చర్మం అయితేనేం?

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:44 AM

పెద్ద చర్మ రంథ్రాలు, మెరుస్తూ ఉండే టి జోన్‌, జిడ్డు కారే ముఖం. ఇవి మీ సమస్యలా? అయితే జిడ్డు చర్మానికి తగిన మేకప్‌ వేసుకుని, అందాల బొమ్మలా వెలిగిపోండి. ఆయిల్‌ ఫ్రీ మేకప్‌ ఎలా వేసుకోవాలంటే..

జిడ్డు చర్మం అయితేనేం?

పెద్ద చర్మ రంథ్రాలు, మెరుస్తూ ఉండే టి జోన్‌, జిడ్డు కారే ముఖం. ఇవి మీ సమస్యలా? అయితే జిడ్డు చర్మానికి తగిన మేకప్‌ వేసుకుని, అందాల బొమ్మలా వెలిగిపోండి. ఆయిల్‌ ఫ్రీ మేకప్‌ ఎలా వేసుకోవాలంటే...

మాయిశ్చరైజర్‌: లైట్‌ వెయిట్‌ మాయిశ్చరైజర్‌ ఎంచుకోవాలి. చర్మం మీదున్న జిడ్డును తగ్గించి, అప్లై చేసిన తర్వాత చర్మంలో చక్కగా ఇంకిపోయి, చర్మాన్ని మృదువుగా మార్చేసే లైట్‌ వెయిట్‌ మాయిశ్చరైజర్‌ను మాత్రమే వాడుకోవాలి. దీంతో తర్వాత అప్లై చేసే మేకప్‌ ఉత్పత్తులన్నీ చర్మం మీద ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా నిలిచి ఉంటాయి.

ప్రైమర్‌: ఎత్తుపల్లాలు లేకుండా బేస్‌ను సమంగా మలిచి, మేక్‌పకు అనువుగా మార్చే సాధనం ప్రైమర్‌. ప్రైమర్‌లోని ఆయిల్‌ ఫ్రీ ఫార్ములా చర్మ రంథ్రాలు, మచ్చలు, డాగులు కనిపించకుండా చేస్తుంది.

మ్యాట్‌ ఫార్ములా: ముఖం మీది జిడ్డుతో కలిసిపోయి మరింత జిడ్డుగా మారే ఫౌండేషన్‌కు బదులుగా మ్యాట్‌ ఫార్ములా కలిగి ఉండే ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. దీంతో ప్రైమర్‌ వేసినా కనిపిస్తూ ఉండే మచ్చలు, డాగులు మటుమాయమవుతాయి.

మేకప్‌ పలుచగా: ఫౌండేషన్‌, కన్‌సీలర్లతో మందపాటి మేక్‌పకు బదుల ుగా వీలైనంత పలుచగా మేకప్‌ అద్దుకోవాలి. అవసరమైతేనే రీఅప్లై చేయాలి. వెట్‌ బ్యూటీ స్పాంజ్‌తో మేక్‌పను బ్లెండ్‌ చేసుకోవాలి.

Updated Date - Apr 27 , 2024 | 01:45 AM