Share News

Navya : డిన్నర్‌ తర్వాత కాఫీ తాగద్దు!

ABN , Publish Date - May 15 , 2024 | 12:25 AM

డిన్నర్‌ చేసిన తర్వాత కాఫీ తాగటం పాశ్చాత్యుల పద్ధతి. ఈ మధ్యకాలంలో మన దేశంలో కూడా డిన్నర్‌ తర్వాత కాఫీ లేదా టీ తాగే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇలా తాగటం వల్ల అనారోగ్యం కలుగుతుందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) హెచ్చరిస్తోంది.

Navya : డిన్నర్‌ తర్వాత కాఫీ తాగద్దు!

డిన్నర్‌ చేసిన తర్వాత కాఫీ తాగటం పాశ్చాత్యుల పద్ధతి. ఈ మధ్యకాలంలో మన దేశంలో కూడా డిన్నర్‌ తర్వాత కాఫీ లేదా టీ తాగే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇలా తాగటం వల్ల అనారోగ్యం కలుగుతుందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) హెచ్చరిస్తోంది.

ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం- కాఫీ లేదా టీలో ఉండే కెఫైన్‌ మన శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. 150 మిల్లీలీటర్ల కాఫీలో 80 నుంచి 120 మిల్లీగ్రాముల కెఫైన్‌ ఉంటుంది. 150 మిల్లీలీటర్ల ఇన్‌స్టెంట్‌ కాఫీలో 50 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫైన్‌ ఉంటుంది. 150 మిల్లీలీటర్ల టీలో 30 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫైన్‌ ఉంటుంది. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం- ప్రతి రోజు ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి 300 మిల్లీగ్రాముల కెఫైన్‌ తీసుకోవచ్చు. అంత కన్నా ఎక్కువ

అయితే అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. అంతే కాకుండా కాఫీ లేదా టీలలో టేనిన్‌ అనే ఒక రసాయనం ఉంటుంది. ఇది మన శరీరంలోకి ఐరెన్‌ వెళ్లకుండా అడ్డుపడుతుంది. మన శరీరంలో హిమోగ్లోబిన్‌ తయారీలో ఐరెన్‌ది ప్రధానమైన పాత్ర. హిమోగ్లోబిన్‌ తగ్గితే శరీరంలో కణాలు శక్తిమంతంగా పనిచేయలేవు. ఆహారం తిన్న గంట సేపులోపులో టీ లేదా కాఫీ తాగితే టేనిన్‌ ప్రభావం మన శరీరంపై పడుతుంది. అందువల్ల ఆహారం తిన్న గంట సేపు తర్వాత మాత్రమే కాఫీ లేదా టీని తాగమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Updated Date - May 15 , 2024 | 12:25 AM