Share News

Blood Test : రక్తపరీక్ష మతలబులు

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:25 PM

రక్తపరీక్ష ఫలితాల్లో మనకు అంతుపట్టని అంశాలెన్నో ఉంటాయి. కొన్ని విలువలు పెరిగిపోయి కనిపిస్తే, కొన్నిటి విలువలు

Blood Test : రక్తపరీక్ష మతలబులు

రక్తపరీక్ష ఫలితాల్లో మనకు అంతుపట్టని అంశాలెన్నో ఉంటాయి. కొన్ని విలువలు పెరిగిపోయి కనిపిస్తే, కొన్నిటి విలువలు తగ్గిపోయి ఉంటాయి. ఆ విలువలు, వాటిలో హెచ్చుతగ్గులకు కారణాల గురించి తెలుసుకుందాం!

టిపి (టోటల్‌ ప్రొటీన్‌)

పెరగడానికి కారణం: డీహైడ్రేషన్‌, ఇన్‌ఫ్లమేషన్‌

తరగడానికి కారణం: రక్తస్రావం, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, పేగుల వ్యాధి, కంజెస్టివ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌

ఎఎల్‌బి (ఆల్బ్యుమిన్‌)

పెరగడానికి కారణం: డీహైడ్రేషన్‌

తరగడానికి కారణం:రక్తస్రావం, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, జీర్ణకోశ వ్యాధి, కంజెస్టివ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌

బియుఎన్‌ (బ్లడ్‌ యూరియా నైట్రోజన్‌)

పెరగడానికి కారణం: డీహైడ్రేషన్‌, మూత్రపిండాల వ్యాధి, మూత్రంలో అడ్డంకి, గుండెజబ్బు, షాక్‌, అధిక ప్రొటీన్‌ డైట్‌

తరగడానికి కారణం: కాలేయ వ్యాధి, ప్రొటీన్‌ లోపం, ఓవర్‌ హైడ్రేషన్‌

జిఎల్‌ఒబి (గ్లోబ్యులిన్‌)

పెరగడానికి కారణం: క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌, క్రానిక్‌ ఇన్‌ఫెక్షన్‌

తరగడానికి కారణం: రక్త నష్టం, గ్యాస్ట్రోఇంటెస్టైనల్‌ డిసీజ్‌, ఇమ్యునోడెఫిసియన్సీస్‌

సిఆర్‌ఈటి (క్రియాటినిన్‌)

పెరగడానికి కారణం: మూత్రపిండాల వ్యాధి, డీహైడ్రేషన్‌, కండరాలు దెబ్బతినడం, మూత్రంలో అడ్డంకి

తరగడానికి కారణం: ఓవర్‌ హైడ్రేషన్‌

జిఎల్‌యు (గ్లూకోజ్‌)

పెరగడానికి కారణం: డయాబెటిస్‌ మెల్లిటస్‌, అక్యూట్‌ స్ట్రెస్‌ రెస్పాన్స్‌

తరగడానికి కారణం: సెప్సిస్‌, పోషకలోపం, నాడీ సంబంధ వ్యాధి

సిహెచ్‌ఔల్‌ (కొలెస్ట్రాల్‌)

పెరగడానికి కారణం: డయాబెటిస్‌ మెల్లిటస్‌, హైపోథైరాయిడిజం, పాంక్రియటైటిస్‌, మూత్రపిండాల వ్యాధులు

తరగడానికి కారణం: లివర్‌ ఇన్‌సఫిసియన్సీ, పేగుల వ్యాధులు

Updated Date - Jun 03 , 2024 | 11:25 PM