Share News

UPSC CSE Prelims 2024: ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకుంటున్నవారికి కీలక అప్‌డేట్.. రేపటి నుంచి..

ABN , Publish Date - Feb 13 , 2024 | 08:38 PM

ఐఏఎస్, ఐపీఎస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ కీలక సర్వీసుల్లో పని చేయడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న యూపీఎస్సీ సివిల్స్ ఆశావహులకు కీలక అప్‌డేట్ వచ్చింది. యూపీఎస్సీ సీఎస్‌ఈ ప్రిలిమ్స్ 2024 (UPSC CSE Prelims 2024) దరఖాస్తుల రిజిస్ట్రేషన్ రేపటి (February 14) నుంచే ప్రారంభం కానుంది. యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ( upsc.gov.in ) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

UPSC CSE Prelims 2024: ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకుంటున్నవారికి కీలక అప్‌డేట్.. రేపటి నుంచి..

ఐఏఎస్, ఐపీఎస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ కీలక సర్వీసుల్లో పని చేయడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న యూపీఎస్సీ సివిల్స్ ఆశావహులకు కీలక అప్‌డేట్ వచ్చింది. యూపీఎస్సీ సీఎస్‌ఈ ప్రిలిమ్స్ 2024 (UPSC CSE Prelims 2024) దరఖాస్తుల రిజిస్ట్రేషన్ రేపటి (February 14) నుంచే ప్రారంభం కానుంది. యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ( upsc.gov.in ) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కీలక వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్-2024 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవనుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ విండో యాక్టివేట్ అయిన తర్వాత అభ్యర్థులు upsc.gov.inలో దరఖాస్తు చేయవచ్చు. రిజిస్ట్రేషన్లకు మార్చి 5, 2024 డెడ్‌లైన్‌గా ఉంది. ఇక దరఖాస్తులు, పరీక్ష తేదీలు, ఖాళీలు, ఇతర వివరాలను యూపీఎస్సీ అప్‌డేట్ చేయనుంది.


ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష 3 దశల్లో జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్‌తో పాటు ఇంటర్వ్యూ దశలు ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. మెయిన్స్‌లో క్వాలిఫై అయినవారు ఇంటర్వ్యూ రౌండ్‌కు ఎంపిక అవుతారు. ఇక ఈ పరీక్ష ఏ కేటగిరి వారు ఎన్నిసార్లు రాయొచ్చనే విషయానికి వస్తే ప్రతి అభ్యర్థి ఆరు సార్లు పరీక్ష రాయవచ్చు. అయితే ఎస్సీ/ఎస్సీ/ఓబీసీ కేటగిరీల వారికి సడలింపు ఉంటుంది. ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులు అపరిమిత సంఖ్యలో ప్రయత్నించ వచ్చు. ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష రాయొచ్చు. ఇక పరీక్ష ఫీజు విషయానికి వస్తే అంగ వైకల్యం ఉన్న అభ్యర్థులు, స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.

అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు ఇవే..

  • భారతీయ పౌరుడై ఉండాలి.

  • వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

  • విద్యార్హత - ఏదైనా గ్రాడ్యుయేషన్.

Updated Date - Feb 13 , 2024 | 08:39 PM