Share News

Mahashivratri 2024 : శివుడికి చేసే అభిషేకాలతో ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా..!

ABN , Publish Date - Mar 08 , 2024 | 02:16 PM

శివయ్య పూలతో, ఆకులతో, అభిషేకంతో ప్రీతి చెందుతాడు. ఈ శివరాత్రి మహోత్సవంలో స్వామిని ఎలా కొలిచినా పలుకుతాడు. అభిషేకం, ఉపవాసం, జాగారం ఇవి ఈ శివరాత్రి రోజున ముఖ్యమైన ఆరాధనలు.

Mahashivratri 2024 : శివుడికి చేసే అభిషేకాలతో ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా..!
Maha Shivratri

శివుడు అభిషేక ప్రియుడంటారు. ఆ దేవదేవుని ఈ శివరాత్రి మహోత్సవంలో ఎంత అభిషేకిస్తే అత్యంత ఫలితాన్ని పొందవచ్చనేది పెద్దల మాట. శివుడికి నైవేద్యాలతో పనిలేదట. కాసిని నీళ్ళను ఆ లింగం మీద నుంచి పోసి తరించవచ్చు. సదా శివుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. జీవితానికి పట్టి పీడిస్తున్న పీడలన్నీ తొలగి ఆయురారోగ్యాలతో జీవించే ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి ఈ శివరాత్రి రోజున శివుని అభిషేకం చేయం పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అసలు ఏ అభిషేకం ఈ రోజున చేయాలి.

1. ఆవు పాలతో అభిషేకించడం వల్ల సర్వ సౌఖ్యాలు పొందుతారు. గోవు పాలు శ్రేష్టమైనవి. అలాగే జన్మ జన్మల పాపాలను కడిగేసే శక్తి గోవులలో ఉంది. గోవు పాలు సకల సంపదలను ఇస్తాయి. శివునికి పాలాభిషేకం అత్యంత ప్రీతికరమైనది.

2. ఆవు పాలలానే ఆవు నెయ్యి కూడా అభిషేకానికి శ్రేష్టమైనవి. ఇవి ధన కనక వస్తువుల ప్రాప్తిని కలిగిస్తాయట. అలాగే ఆవు నెయ్యితో అభిషేకం అంటే శివునికి అత్యంత ప్రీతి.

3. మారేడు బిల్వపత్రాలతో శివుని పూజిస్తే భోగభాగ్యాలూ కలుగుతాయి. ఆ త్రినేత్రుడికి ఈ త్రిదళంతో అభిషేకం మహా ప్రీతి.

4. గరిక నీటితో శివాభిషేకం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. పోగొట్టుకున్న ధనన్ని తిరిగి ఇస్తుంది. అలాగే సుఖ సౌఖ్యాలను కూడా ఇస్తుంది.

ఇవి కూడా చదవండి:

శివరాత్రి రోజున జాగారం చేయడం వల్ల కలిగే ఉపయోగాలేంటి.. ! అసలు ఎందుకు చేయాలి.

శివరాత్రికి ముస్తాబుకానున్న ప్రసిద్ధ దేవాలయాలు ఇవే..!

5. నువ్వుల నూనెతో అభిషేకం చాలా ప్రాముఖ్యమైనది. మృత్యుంజయ హోమం ఎంత ఫలితాన్ని ఇస్తుందో, నువ్వుల నూనెతో చేసే అభిషేకం మృత్యు భయాన్ని తొలగిస్తుంది.

6. పెరుగుతో చేసే అభిషేకం వల్ల ఆరోగ్యాన్ని పొందవచ్చు. రోగాలు దరిచేరనీయదు.

7. చెక్కెరతో అభిషేకం చేయడం వల్ల ఈతి భాధలు తొలగి, దుఃఖం నశించి సంతోషం విరుస్తుంది. కుటుంబ సౌఖ్యానికి ఈ అభిషేకం మంచిది.


ఇది కూడా చదవండి: బ్రెడ్ ఫ్రూట్ గురించి విన్నారా? దీనిలో ఎన్ని పోషకాలంటే..!

8. ఫుష్పోదకము పూలతో చేసే అభిషేకాలనికి భూలాభం కలుగుతుంది. సృష్టిలోని ప్రతి పువ్వూ ఆ పరమేశ్వర ప్రసాదమే.. పూలతో చేసే అభిషేకం స్వామికి ప్రితికరమైనది.

9. రుద్రాక్ష జలభిషేకం సకల ఐశ్వర్యాలను, కస్తూరి కలిపిన నీరు కీర్తిని, పసుపు నీరు అభిషేకం మంగళ ప్రదము, శుభ ప్రదమైనది.

10.ఇవన్నీ శివుని పూజించే అభిషేకాలు వాటి ఫలితాలు.. శివయ్య పూలతో, ఆకులతో, అభిషేకంతో ప్రీతి చెందుతాడు. ఈ శివరాత్రి మహోత్సవంలో స్వామిని ఎలా కొలిచినా పలుకుతాడు. అభిషేకం, ఉపవాసం, జాగారం ఇవి ఈ శివరాత్రి రోజున ముఖ్యమైన ఆరాధనలు.

Updated Date - Mar 08 , 2024 | 02:16 PM