Share News

Budget: 25 కోట్లకుపైగా మంది ప్రజలకు పేదరికం దూరం: నిర్మలా సీతారామన్

ABN , Publish Date - Feb 01 , 2024 | 01:16 PM

దేశంలో 25 కోట్లకుపైగా మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బహుముఖ పేదరికం నుంచి విముక్తి పొందారని బడ్జెట్ ప్రసంగంలో ఆమె చెప్పారు. పేదలకు సాధికారతపై తమ ప్రభుత్వాన్ని ప్రగాఢమైన విశ్వాసం ఉందని, సబ్ కా సాథ్ సాధనతో ప్రభుత్వం 25 కోట్ల మంది ప్రజలకు దూరంగా పేదరికాన్ని పారదోలేందుకు ప్రభుత్వం సహాయం అందజేసిందని సీతారామన్ చెప్పారు.

Budget: 25 కోట్లకుపైగా మంది ప్రజలకు పేదరికం దూరం: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: దేశంలో 25 కోట్లకుపైగా మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బహుముఖ పేదరికం నుంచి విముక్తి పొందారని బడ్జెట్ ప్రసంగంలో ఆమె చెప్పారు. పేదలకు సాధికారతపై తమ ప్రభుత్వాన్ని ప్రగాఢమైన విశ్వాసం ఉందని, సబ్ కా సాథ్ సాధనతో ప్రభుత్వం 25 కోట్ల మంది ప్రజలకు దూరంగా పేదరికాన్ని పారదోలేందుకు ప్రభుత్వం సహాయం అందజేసిందని సీతారామన్ చెప్పారు. గత పదేళ్ల కాలంలో సబ్‌కా సాథ్ ద్వారా పేదరికాన్ని భారీగా నిర్మూలించామని చెప్పారు.

గత దశాబ్ద కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సానుకూల పరివర్తన చెందిందని, భవిష్యత్తుపై ఆశలు చిగురించాయని సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లో దేశం పలు సవాళ్లను ఎదుర్కొందని, నరేంద్ర మోదీ సారధ్యంలోని ప్రభుత్వం వాటిని సమిష్టి కృషి, సమ్మిళిత వృద్ధి (సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్) ద్వారా పరిష్కరించిందని ఆమె అన్నారు. దేశ ప్రజలు భవిష్యత్తు వైపు ఆశతో ఎదురుచూస్తున్నారని అన్నారు.

సమగ్రాభివృద్ధి, వృద్ధి లక్ష్యంగా గ్రామీణ స్థాయి వరకు సేవలను అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, మునుపటి విధానాలకు స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని ప్రత్యక్షంగా లక్ష్య చేసుకొని వారి అభ్యున్నతిపై దృష్టి సారించనున్నట్టు సీతారామన్ చెప్పారు.

Updated Date - Feb 01 , 2024 | 01:32 PM