AP Elections: ఐదుగురు ఐపీఎస్‌లను బదిలీ చేయండి: సీఈసీ
ABN , Publish Date - Apr 02 , 2024 | 04:35 PM
రాష్ట్రంలో అయిదుగురు ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ( central election commission) కొరడా ఝుళిపించింది. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని రాష్ట ఎన్నికల సంఘం సీఈవో ఎంకే మీనాను ఆదేశించింది.
అమరావతి: రాష్ట్రంలో అయిదుగురు ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ( central election commission) కొరడా ఝుళిపించింది. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని రాష్ట ఎన్నికల సంఘం సీఈవో ఎంకే మీనాను ఆదేశించింది. ఆయా జిల్లాల ఎస్పీలను ఎన్నికలకు సంబంధం లేని పోస్ట్‌ల్లో నియమించాలని జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ ఆదేశాలను.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఈసీ సీఈవో మీనా పంపారు.
ఇక ఆయా జిల్లాల ఎస్పీ పోస్టులకు ప్యానెల్ పంపాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్‌లపై సీఈసీ వేటు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో ఇచ్చిన నివేదికతోపాటు ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు.. ఈ ఎస్పీలపై సీఈసీ బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది.
గుంటూరు రేంజ్ ఐజీ పాల్‌రాజ్‌ను సైతం ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించింది. ఇక ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్త మునియ్య హత్య నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీని ఈసీ బదిలీ చేసింది. అలాగే ప్రధాన మంత్రి సభలో భద్రత లోపాలపై గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజ్‌తోపాటు పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిపై వేటు వేసింది. తమ కింది అధికారులకు బాధ్యతలు అప్పగించి.. విధుల నుంచి తప్పుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..