Share News

MK Meena: సీఎస్, ఇంటెలిజెన్స్ డీజీపై ఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:42 PM

ఈ రోజు ఉదయం 11.00 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని ఏపీ ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. గురువారం అమరావతిలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని తెలిపారు.

MK Meena: సీఎస్, ఇంటెలిజెన్స్ డీజీపై ఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం
AP Election commission CEO MK Meena

అమరావతి, ఏప్రిల్ 18: ఈ రోజు ఉదయం 11.00 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని ఏపీ ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ కుమార్ మీనా (AP Election Commission CEO MK Meena) వెల్లడించారు. గురువారం అమరావతిలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని తెలిపారు.

AP Elections: మళ్లీ కుప్పం బయలుదేరిన భువనమ్మ

26వ తేదీన నామినేషన్లు పరిశీలన ఉంటుందన్నారు. ఇక 29వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణ గడువు ఉంటుందని స్పష్టం చేశారు. 6 అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్ ఉంటుందని వివరించారు. అయితే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 వరకూ పోలింగ్ ఉంటుందని చెప్పారు.

YS Sharmila: వైయస్ జగన్ అవసరమా?

50 మంది సాధారణ పరిశీలకులు ఉంటారన్నారు. తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు 18 మంది పోలీసు పరిశీలకులను నియమించినట్లు వివరించారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి వద్దే ఓటి హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పించామన్నారు.


నేటి నుంచి హోం ఓటింగ్ ప్రక్రియ మొదలైందన్నారు. ఏప్రిల్ 29వ తేదీ వరకు హోం ఓటింగ్ కోసం దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు. మే 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఇంటింటికీ పోలింగ్ టీమ్స్ వెళ్లి ఓటింగ్ తీసుకుంటాయన్నారు.

AP News: జగన్‌పై రాయిదాడి కేసు రిమాండ్ రిపోర్ట్‌ వచ్చేసింది.. పోలీసులు ఏం తేల్చారంటే?

సర్వీస్ ఓటర్లకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఉంటుందని స్పష్టం చేశారు. మే 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎన్నికల విధుల్లో ఉన్న వారికి ఫెసిలిటిషవ్ సెంటర్లలో ఓటింగ్ ఉంటుందన్నారు. 5,26,000 మందికి పోస్టల్ బ్యాలెట్ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో 12,459 క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలున్నాయని గుర్తు చేశారు. అటువంటి కేంద్రాలతో కలిపి 30,111 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. మద్యం నియంత్రించాలని కేంద్ర పరిశీలకులు కోరారన్నారు.

మద్యం తయారీ కంపెనీలు, మద్యం నిల్వ ఉంచే గోడౌన్లు, మద్యం సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్‌తో మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 121 కోట్ల విలువైన నగదు, మద్యం, అభరణాలు స్వాదీనం చేసుకున్నట్లు వివరించారు.


అయితే ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి నేటి వరకూ 179 కోట్లకుపైగా నగదు, మద్యం, అభరణాలు స్వాదీనం చేసుకున్నామన్నారు. తనిఖీల్లో సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీ ఇంటిలిజెన్స్ తదితర ఉన్నతాధికారులపై ఫిర్యాదులు అందాయని.. వాటిని ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలిపారు.

AP Elections: నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వైసీపీ పరిస్థితి ఏంటో తెలుసా?

వారి అదేశం మేరకు అయా ఉన్నతాధికారుల నుంచి వివరణ తీసుకుని.. ఈసీ పంపామన్నారు. అయితే ఈ అంశంపై ఈసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అయితే ఎన్నికల వేళ.. నగదు సీజ్ సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలని తనిఖీ బృందాలకు ఈ సందర్బంగా మీనా సూచించారు. తనిఖీల్లో దొరికిన నగదు రాజకీయాలకు, నేరాలకు సంబంధం ఉంటే.. వెంటనే కేసు బుక్ చేయాలని ఆదేశించారు.

నగదు సీజ్ చేసిన వెంటనే.. గ్రీవెన్స్ కమిటీకి డాక్యుమెంట్లు చూపిస్తే... అదే రోజు నగదు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇక సీజ్ చేసిన రూ.31 కోట్లలో రూ.18 కోట్లు ఎన్నికలకు సంబంధం లేని నగదు ఉందన్నారు. వాటిని వెంటనే విడుదల చేశామని మీనా స్పష్టం చేశారు. అయితే 10 లక్షలకుపైగా నగదు పట్టుకుంటే.. ఆదాయపు పన్ను శాఖ పరధిలోకి వెళ్లిపోతుందని ఎన్నికల సంఘం సీఈవో మీనా పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం...

Updated Date - Apr 18 , 2024 | 06:53 PM