BRS Khammam meeting: బీజేపీపై కేసీఆర్ పోరాటానికి మా మద్దతు: కేరళ సీఎం విజయన్‌

ABN , First Publish Date - 2023-01-18T16:55:02+05:30 IST

రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీపై (BJP) సీఎం కేసీఆర్‌ (KCR) పోరాడుతున్నారని కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) అన్నారు. కేసీఆర్ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

BRS Khammam meeting: బీజేపీపై కేసీఆర్ పోరాటానికి మా మద్దతు: కేరళ సీఎం విజయన్‌

ఖమ్మం: రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీపై (BJP) సీఎం కేసీఆర్‌ (KCR) పోరాడుతున్నారని కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) అన్నారు. కేసీఆర్ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఖమ్మం సభ (BRS Khammam meeting) దేశానికి ఒక దిక్సూచిగా నిలుస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఖమ్మం వేదికగా జరుగుతున్న భారీ బీఆర్ఎస్ బహిరంగ సభలో పినరయి విజయన్ ప్రసంగించారు. ఇక తెలంగాణ పథకాలు, కార్యక్రమాలు ప్రశంసనీయమని పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) వ్యాఖ్యానించారు. తెలంగాణ పథకాలను కేరళలో పెట్టే ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు.

ఫెడరల్‌ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన సాగుతోందని విమర్శించారు. బీజేపీ సర్కార్‌ వైఖరితో రాజ్యాంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులు, అధికారాలను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ శక్తులకే మోదీ సర్కార్ ఊతం ఇస్తోందని, రాజ్‌భవన్‌లు బీజేపీ కార్యాలయాలుగా మారిపోయాయని ఘాటైన విమర్శలు చేశారు. హిందీని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

దళితబంధు దేశానికి ఆదర్శం: డి.రాజా

రైతుబంధు, దళితబంధు వంటి పథకాలు దేశానికి ఆదర్శనీయమైన సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా (D raja) అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా మోదీ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్‌ కంపెనీలకే ప్రధాని మోదీ మేలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-18T17:58:21+05:30 IST