Neha Shetty: డుమాంట్ ఐస్‌క్రీమ్ స్టోర్‌‌లో నేహా శెట్టి సందడి

ABN , First Publish Date - 2023-03-18T23:58:27+05:30 IST

వేసవి తాపాన్ని ఐస్ క్రీమ్ చల్లదనంతో ఆహ్లాదపరుచుకునేందుకు కొంపల్లిలోని డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్ సరైన కేంద్రం అని అన్నారు అందాల బ్యూటీ

Neha Shetty: డుమాంట్ ఐస్‌క్రీమ్ స్టోర్‌‌లో నేహా శెట్టి సందడి
Neha Shetty

హైదరాబాద్: వేసవి తాపాన్ని ఐస్ క్రీమ్ చల్లదనంతో ఆహ్లాదపరుచుకునేందుకు కొంపల్లిలోని డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్ సరైన కేంద్రం అని అన్నారు అందాల బ్యూటీ, ‘డిజె టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి. హైదరాబాద్‌లోని కొంపల్లిలో డుమాంట్ ఐస్‌క్రీమ్ స్టోర్‌ను తాజాగా ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ.. నేను చాలా కాలంగా బ్రాండ్ గురించి వింటున్నాను. దీనిని ఒకసారి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. వైట్ చాక్లెట్ బ్లాండీ ఫ్లేవర్ నాకు చాలా చాలా ఇష్టం. దానిని తింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ టేస్ట్ చూడటానికి చాలా ఇష్టపడతాను.. అన్నారు. త్వరలో ‘బెదురులంక 2012’ మూవీతో అందరినీ అలరిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

Neha-Shetty-1.jpg

ఈ సందర్భంగా డుమాంట్ స్టోర్‌ ఫౌండర్ వివేక్ మరియు ఫ్రాంచైజ్ యజమాని అభిషేక్ దేవ మాట్లాడుతూ “డుమాంట్ అంటే రుచి, తాజాదనం మరియు వినోదం. 50 కంటే ఎక్కువ రుచులు, అధిక నాణ్యత గల పదార్థాలతో ఇక్కడి ఐస్ క్రీమ్స్ తయారు చేయబడ్డాయన్నారు. అత్యుత్తమ ఐస్‌క్రీమ్ మరియు కాఫీ (సరికొత్త జోడింపు)ని ఆస్వాదించడానికి ఇది సరైన ప్రాంతం అన్నారు. ప్రత్యేక రుచులు కోరుకొనే వారికీ ఇది సరికొత్త వేదికగా నిలుస్తుందని.. డుమాంట్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ అంతటా 37 అవుట్‌లెట్‌లతో ఐస్ క్రీమ్ మార్కెట్‌లో రాబోయే బ్రాండ్ అని తెలిపారు.

Updated Date - 2023-03-19T00:28:05+05:30 IST