Yashaswi Jaiswal: ``కింగ్``తో నయా సూపర్ స్టార్.. విరాట్ కోహ్లీ నుంచి సలహాలు తీసుకున్న యశస్వి జైస్వాల్!

ABN , First Publish Date - 2023-05-15T09:55:22+05:30 IST

యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక అద్భుతమైన వరం. ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే కాదు.. దేశ, విదేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే వెసులుబాటు కూడా యువ ఆటగాళ్లకు కల్పిస్తోంది.

Yashaswi Jaiswal: ``కింగ్``తో నయా సూపర్ స్టార్.. విరాట్ కోహ్లీ నుంచి సలహాలు తీసుకున్న యశస్వి జైస్వాల్!

యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక అద్భుతమైన వరం. ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే కాదు.. దేశ, విదేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే వెసులుబాటు కూడా యువ ఆటగాళ్లకు కల్పిస్తోంది. సీనియర్ ఆటగాళ్ల నుంచి సలహాలు తీసుకోవడం, వారి అనుభవాలు తెలుసుకోవడం యువ ఆటగాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుత సీజన్‌లో (IPL 2023) అమోఘంగా రాణిస్తున్న యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashaswi Jaiswal) టీమిండియా దిగ్గజ ఆటగాళ్లతో వీలు చిక్కినప్పుడల్లా మాట్లాడుతున్నాడు.

కొన్ని రోజల క్రితం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీతో (MS Dhoni) మాట్లాడిన జైస్వాల్.. తాజాగా కోహ్లీని (Virat Kohli) కలిశాడు. మూడ్రోజుల క్రితం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ అడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ను కోహ్లీ సోషల్ మీడియా ద్వారా ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్‌ల మధ్య మ్యాచ్ (RRvsRCB) జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కోహ్లీతో జైస్వాల్ మాట్లాడాడు. ఇద్దరూ ప్రతిభావంతులు మాట్లాడుకోవడం అభిమానులను అలరించింది.

Sunil Gavaskar: షర్ట్ మీద కాదు.. గుండెల్లో.. ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్!

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ను బెంగళూరు చిత్తు చేసింది. ఏకంగా 112 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. డుప్లెసి (55), మ్యాక్స్‌వెల్ (54) రాణించారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌట్ అయింది. పార్నెల్ 3 వికెట్లు పడగొట్టాడు. హెట్‌మేయర్ (35) తప్ప రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ ఎవరూ పది పరుగులు దాటలేదు.

Updated Date - 2023-05-15T09:55:22+05:30 IST