Viral Video: గుజరాత్ టీమ్ విన్నింగ్ మూమెంట్స్.. స్టేడియంలో అభిమానులు ఎలా పండగ చేసుకున్నారో చూడండి..

ABN , First Publish Date - 2023-04-14T10:17:16+05:30 IST

గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ సీజన్‌లో కూడా ఫామ్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకటి మాత్రమే ఓడి మూడు విజయాలు నమోదు చేసింది.

Viral Video: గుజరాత్ టీమ్ విన్నింగ్ మూమెంట్స్.. స్టేడియంలో అభిమానులు ఎలా పండగ చేసుకున్నారో చూడండి..

గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు ఈ సీజన్‌లో కూడా ఫామ్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకటి మాత్రమే ఓడి మూడు విజయాలు నమోదు చేసింది. గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో (PBKS) జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ రాణించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న మొహలీ పిచ్‌పై అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగి పంజాబ్ టీమ్‌ను 153 పరుగులకే కట్టడి చేసింది (GTvsPBKS).

అనంతరం ఛేజింగ్‌లో కూడా గుజరాత్‌కు పెద్ద సవాలు ఎదురుకాలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) (67), సాహా (30) చెలరేగడంతో సునాయాసంగా విజయం సాధించింది. మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం గుజరాత్ అభిమానులు స్టేడియంలో పండగ చేసుకున్నారు. రాహుల్ తెవాటియా విన్నింగ్ రన్ కొట్టిన వెంటనే గుజరాత్ ఆటగాళ్లు, స్టేడియంలోని అభిమానులు సంబరాలు ప్రారంభించారు. 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసిన మోహిత్ శర్మ ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు.

Hardik Pandya: ఆ క్యాచ్ విషయంలో నమ్మకం లేదు.. సాహాపై నమ్మకంతో డీఆర్‌ఎస్ కోరిన హార్దిక్.. తర్వాత ఏం జరిగిందో చూడండి..

కేకేఆర్‌తో (KKR) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టీమ్ అనూహ్యంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్లో విజయానికి 29 పరుగులు కావాల్సిన దశలో కేకేఆర్ బ్యాటర్ రింకూ (Rinku Singh) చెలరేగిపోయాడు. యశ్ దయాల్ (Yash Dayal) వేసిన ఆ ఓవర్లో చివరి 5 బంతులకు 5 సిక్స్‌లు కొట్టి తన జట్టును గెలిపించాడు.

Updated Date - 2023-04-14T10:17:16+05:30 IST