CSK vs LSG: వామ్మో.. రుతురాజ్ సూపర్ సిక్స్.. స్టేడియంలో ఉన్న కారు పరిస్థితి ఏమైందంటే..

ABN , First Publish Date - 2023-04-04T08:41:39+05:30 IST

ఈ ఐపీఎల్ (IPL 2023)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) అదరగొడుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ మరోమారు విశ్వరూపం ప్రదర్శించాడు.

CSK vs LSG: వామ్మో.. రుతురాజ్ సూపర్ సిక్స్.. స్టేడియంలో ఉన్న కారు పరిస్థితి ఏమైందంటే..

ఈ ఐపీఎల్ (IPL 2023)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) అదరగొడుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ మరోమారు విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ చెలరేగి అర్ధ సెంచరీ చేశాడు. 26 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు పూర్తిచేశాడు. రుతురాజ్ దెబ్బకు చెన్నై స్కోరుబోర్డు పరుగులు తీసింది.

లక్నో బౌలర్ కృష్ణప్ప గౌతమ్ వేసిన ఓవర్లో మిడ్ ఆన్ మీదుగా రుతురాజ్ భారీ సిక్స్ కొట్టడంతో బంతి స్టేడియంలో టాటా టియాగో (Tata Tiago Car) కారుకు తగిలింది. ఆ దెబ్బకు కారుపై లొత్త (Dent) ఏర్పడింది. ఐపీఎల్‌కు అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తున్న టాటా (Tata) సంస్థ ఈ సీజన్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఆటగాడికి టాటా టియాగో ఈవీ కారును బహుమతిగా అందిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగే ప్రతి మైదానంలో టియాగో కారును డిస్‌ప్లేలో ఉంచుతోంది. బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టినపుడు బంతి వెళ్లి కారుకు తగిలితే టాటా మోటార్స్ (Tata Motors) సంస్థ రూ.5 లక్షల రూపాయలను ప్రకృతి, జీవ వైవిధ్యం కోసం ఖర్చు చేస్తుంది.

Dhoni Six: 2011 ప్రపంచకప్‌ అందించిన ధోనీ సిక్స్‌ను మరచిపోగలమా? ఆ సిక్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏం చేస్తున్నారంటే..

గతేడాది ఐపీఎల్ సమయంలోనే టాటా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అప్పుడు కూడా కారుకు బంతి తగిలితే క్యాష్ ప్రైజ్‌ను ప్రకటించింది. అప్పుడు ఆ డబ్బులను రైనోల (Rhinos) సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది. ఈ సంవత్సరం కర్ణాటకలోని కాఫీ తోటల పెంపకం (Coffee plantations in Karnataka) కోసం వినియోగిస్తోంది.

Updated Date - 2023-04-04T08:41:39+05:30 IST