Rohit Sharma: సూర్య వచ్చి అడిగిన తర్వాత ప్లాన్ మార్చుకున్నాం.. విధ్వంసకర ఇన్నింగ్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2023-05-13T12:23:42+05:30 IST

ఐపీఎల్ కీలక ప్లే-ఆఫ్స్‌కు చేరుకుంటున్న దశలో ముంబై ఇండియన్స్ టీమ్ జూలు విదిల్చింది. ఇప్పటివరకు ఈ లీగ్‌లో 12 మ్యాచ్‌లు ఆడి ఏడింట్లో గెలిచింది. చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

Rohit Sharma: సూర్య వచ్చి అడిగిన తర్వాత ప్లాన్ మార్చుకున్నాం.. విధ్వంసకర ఇన్నింగ్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఐపీఎల్ (IPL 2023) కీలక ప్లే-ఆఫ్స్‌కు చేరుకుంటున్న దశలో ముంబై ఇండియన్స్ (MI) టీమ్ జూలు విదిల్చింది. ఇప్పటివరకు ఈ లీగ్‌లో 12 మ్యాచ్‌లు ఆడి ఏడింట్లో గెలిచింది. చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) గత ఆరు మ్యాచ్‌ల నుంచి విశేషంగా రాణిస్తున్నాడు. శుక్రవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (GTvsMI) సెంచరీ సాధించి అందరినీ ఆకట్టుకున్నాడు. సూర్య సంచలన ఇన్నింగ్స్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రశంసలు కురిపించాడు.

``ముఖ్యమైన మ్యాచ్‌లో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో క్రమంగా మెరుగవుతున్నాం. ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్ తిరిగి ఫామ్‌లోకి రావడం చాలా సంతోషం కలిగిస్తోంది. బ్యాటింగ్‌లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కొనసాగించాలనుకున్నాం. అయితే సూర్య ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వెళతానని అడిగాడు. సూర్య అంత ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు మేం ఆపాలనుకోలేదు. సూర్య కోసం మా ప్లాన్ మార్చుకున్నామ``ని రోహిత్ చెప్పాడు.

Rashid Khan: రషీద్ ఖాన్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సింది.. ఆల్‌రౌండర్‌పై నెటిజన్ల ప్రశంసలు!

సూర్య ప్రతి మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించాలనే తపనతో ఉంటాడని, గత మ్యాచ్‌లో తను ఏం చేశాడో వెంటనే మర్చిపోతాడని రోహిత్ పేర్కొన్నాడు. గత మ్యాచ్‌లో సంచలనం సృష్టించాననే గర్వం సూర్యకు ఉండదని, అలాగే బాగా ఆడలేకపోయాననే బాధ కూడా కనిపించదని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారని రోహిత్ ప్రశంసించాడు.

Updated Date - 2023-05-13T12:23:42+05:30 IST