Naveen-ul-Haq: విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ.. నవీన్-ఉల్-హక్‌పై దారుణ ట్రోలింగ్.. వైరల్ అవుతున్న మీమ్స్!

ABN , First Publish Date - 2023-05-19T14:08:51+05:30 IST

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు

Naveen-ul-Haq: విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ.. నవీన్-ఉల్-హక్‌పై దారుణ ట్రోలింగ్.. వైరల్ అవుతున్న మీమ్స్!

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో (RCBvsSRH) మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు (Kohli Century). 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో ఒత్తిడికి లోనవకుండా చక్కగా ఆడి తన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించాడు. ఈ నేపథ్యంలో విరాట్ ఇన్నింగ్స్‌పై ప్రేక్షకులే కాదు.. మాజీ ఆటగాళ్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో లఖ్‌నవూ బౌలర్, కోహ్లీని సోషల్ మీడియా ద్వారా తరచుగా టార్గెట్ చేస్తున్న నవీన్-ఉల్-హక్‌ (Naveen-ul-Haq)పై విరాట్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు దిగారు. కొన్ని రోజుల కిందట లఖ్‌నవూ, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగినపుడు కోహ్లీతో నవీన్-ఉల్-హక్, గంభీర్ (Gautam Gambhir) గొడవకు దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి వారిద్దరూ సోషల్ మీడియా ద్వారా కోహ్లీని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నవీన్‌పై కోహ్లీ ఫ్యాన్స్ ట్రోలింగ్ (Trolling on Naveen-ul-Haq) మొదలుపెట్టారు. వారిద్దరి గురించి ఫన్నీ మీమ్స్ (Funny Memes) షేర్ చేస్తున్నారు.

Anushka Sharma: సెంచరీ అనంతరం అనుష్కకు ఫోన్ చేసిన కోహ్లీ.. మైదానం నుంచే వీడియో కాల్ చేసి..

ఇటీవల ఒక మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ అయినపుడు నవీన్ మామిడి పండ్ల ముక్కలు ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీని ఔట్ చేసిన బౌలర్‌ను గంభీర్ ప్రశంసించాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ బాగా ఆడినప్పుడల్లా అతడి ఫ్యాన్స్ నవీన్, గంభీర్‌ను ట్రోల్ చేస్తున్నారు.

Updated Date - 2023-05-19T14:08:51+05:30 IST