Hardik Pandya: ధోనీ స్కెచ్ వేస్తే మామూలుగా ఉండదు.. హార్దిక్ పాండ్యా అవుట్‌కు ముందు ఏం జరిగిందో చూడండి..

ABN , First Publish Date - 2023-05-24T13:24:11+05:30 IST

టీమిండియాను అంతర్జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యర్థిగా నిలబెట్టిన ఘనత కచ్చితంగా మహేంద్ర సింగ్ ధోనీదే. ధోనీ తన కెరీర్లో బ్యాట్స్‌మెన్‌గా విఫలమై ఉంటాడు తప్ప.. నాయకుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.

Hardik Pandya: ధోనీ స్కెచ్ వేస్తే మామూలుగా ఉండదు.. హార్దిక్ పాండ్యా అవుట్‌కు ముందు ఏం జరిగిందో చూడండి..

టీమిండియాను (Team India) అంతర్జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యర్థిగా నిలబెట్టిన ఘనత కచ్చితంగా మహేంద్ర సింగ్ ధోనీదే (MS Dhoni). ధోనీ తన కెరీర్లో బ్యాట్స్‌మెన్‌గా విఫలమై ఉంటాడు తప్ప.. నాయకుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. మైదానంలో కూల్‌గా ఉంటూనే ధోనీ వేస్తే ఎత్తులు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఉంటాయి. తాజాగా చెన్నైలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ (GTvCSK) జరిగింది. ఈ మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్సీ టాప్ లెవెల్‌‌లో ఉంది.

ముఖ్యంగా గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను (MS Dhoni) అవుట్ చేసిన తీరు‌కు మాత్రం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ధోనీ మాస్టార్ ప్లాన్‌‌కు పాండ్యా అడ్డంగా దొరికిపోయాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో పాండ్యా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తీక్షణ (Maheesh Theekshana) బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్లో పాండ్యా స్ట్రైకింగ్‌కు వచ్చినపుడు ధోనీ ఫీల్డింగ్‌ను (Fielding) మార్చాడు. ఆన్ సైడ్‌లో ఉన్న జడేజా‌ను (Ravindra Jadeja) ఆఫ్ సైడ్‌కు మార్చాడు. ఫీల్డింగ్ మార్పును కూడా పాండ్యా గమనించాడు. అయినా ఆ ఓవర్లో తీక్షణ వేసిన ఐదో బంతిని పాండ్యా ఆఫ్ సైడ్ ఆడాడు.

Ruturaj Gaikwad: ఆ నో-బాల్ ఎంత పని చేసింది.. గుజరాత్ ఓటమికి అది కూడా ఓ కారణమే..

ఆ బంతి నేరుగా వెళ్లి జడేజా చేతిలో పడింది. దీంతో పాండ్యా 7 పరుగులు మాత్రమే చేసి నిరాశగా వెనుదిరిగాడు. ఆ సమయంలో కామెంటేటర్‌గా ఉన్న రవిశాస్త్రి.. ``పాండ్యా ఇగోను ధోనీ రెచ్చగొట్టాడ``ని కామెంట్ చేశాడు. జడేజా పై నుంచే కొడదామనుకుని కరెక్ట్‌గా కనెక్ట్ కాకపోవడంతో దొరికిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-05-24T13:24:11+05:30 IST