Liam Livingstone: లివింగ్‌స్టోన్‌కు ఏమైంది? శుక్రవారం మ్యాచ్‌లో తడబాటు.. ఔటైన తర్వాత నవ్వుకుంటూ..!

ABN , First Publish Date - 2023-05-20T12:25:22+05:30 IST

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) ప్రవర్తన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ లీగ్‌లో లివింగ్‌స్టోన్ అంచనాల మేరకు రాణిస్తున్నాడు. మరీ గొప్పగా కాకపోయినా ప్రభావవంతంగానే ఆడుతున్నాడు.

Liam Livingstone: లివింగ్‌స్టోన్‌కు ఏమైంది? శుక్రవారం మ్యాచ్‌లో తడబాటు.. ఔటైన తర్వాత నవ్వుకుంటూ..!

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) ప్రవర్తన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ లీగ్‌లో లివింగ్‌స్టోన్ అంచనాల మేరకు రాణిస్తున్నాడు. మరీ గొప్పగా కాకపోయినా ప్రభావవంతంగానే ఆడుతున్నాడు. శుక్రవారం సాయంత్రం రాజస్థాన్ రాయల్స్ టీమ్‌తో పంజాబ్ టీమ్ (PBKSvsRR) తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ప్రారంభం నుంచి లివింగ్‌స్టోన్ తడబడుతూనే ఆడాడు. 9 పరుగులు చేసి ఔటయ్యాడు.

పంజాబ్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో నవదీప్ షైనీ (Navdeep Saini) వేసిన బంతులకు లివింగ్‌స్టోన్ బాగా ఇబ్బంది పడ్డాడు. ఒక బంతిని స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా అది ప్యాడ్స్‌కు బలంగా తాకింది. దాంతో లివింగ్‌స్టోన్ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత మూడో బంతికి నవదీప్ ఫుల్ లెంగ్త్ డెలివరీ వేశాడు. కనీసం ఆ బంతి ఎలా వస్తుందో చూడకుండా లివింగ్‌స్టోన్ గుడ్డిగా బ్యాట్ ఊపాడు. దాంతో ఆ బంతి నేరుగా వెళ్లి వికెట్లకు తగిలింది. క్లీన్ బౌల్డ్ అయిన తర్వాత లివింగ్‌స్టోన్ పెద్దగా నవ్వుకుంటూ పెవిలియన్‌కు వెళ్లాడు.

Sanjay Manjrekar: కోహ్లీ బలం అదే.. ఆ మైండ్‌సెట్‌తో ఎప్పుడు ఆడినా కోహ్లీ విఫలం కాలేదు..!

ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సిన దశలో నిర్లక్ష్యంగా ఆడడమే కాకుండా.. ఔటైన తర్వాత నవ్వుకుంటూ వెళ్లడం చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. లివింగ్‌స్టోన్‌కు ఏదో అయిందని పంజాబ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి.

Updated Date - 2023-05-20T12:25:22+05:30 IST