Virat vs Gambhir: విరాట్‌ను వదలరా? కోహ్లీ అవుట్.. సెలబ్రేట్ చేసుకున్న నవీనుల్, గంభీర్..!

ABN , First Publish Date - 2023-05-10T11:37:13+05:30 IST

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఆటగాడు నవీన్-ఉల్-హక్, మెంటార్ గౌతమ్ గంభీర్ దాడి కొనసాగుతూనే ఉంది. ఇటీవల లఖ్‌నవూ, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స మ్యాచ్ అనంతరం కోహ్లీతో నవీనుల్, గంభీర్ గొడవపడిన సంగతి తెలిసిందే.

Virat vs Gambhir: విరాట్‌ను వదలరా? కోహ్లీ అవుట్.. సెలబ్రేట్ చేసుకున్న నవీనుల్, గంభీర్..!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై (Virat Kohli) లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) ఆటగాడు నవీన్-ఉల్-హక్ (Naveen Ul Haq), మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) దాడి కొనసాగుతూనే ఉంది. ఇటీవల లఖ్‌నవూ, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స మ్యాచ్ (RCBvsLSG) అనంతరం కోహ్లీతో నవీనుల్, గంభీర్ గొడవపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి నుంచి సోషల్ మీడియా ద్వారా వారిద్దరూ కోహ్లీని టార్గెట్ చేస్తూ పరోక్షంగా పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో (RCBvsMI) కోహ్లీ ఒక పరుగు చేసి అవుటయ్యాడు.

కోహ్లీ స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో గంభీర్, నవీనుల్ పండగ చేసుకున్నారు. కోహ్లీ అవుట్ కాగానే నవీనుల్ హక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టాడు. ముంబై-ఆర్సీబీ మ్యాచ్ చూస్తూ ఎదురుగా మంచం మీద ఉన్న మామిడి పండ్ల (Mangoes)ముక్కలను ఫొటో తీసి పోస్ట్ చేశాడు. ``స్వీట్ మ్యాంగోస్`` అని కామెంట్ చేశాడు. కోహ్లీ అవుట్ అయిన మరుక్షణమే నవీనుల్ ఈ పోస్ట్ పెట్టాడు. కోహ్లీ అవుట్ కావడం చాలా సంతోషం కలిగిస్తోందని అని అర్థం వచ్చేలా ఆ పోస్ట్ ఉండడంతో అది వైరల్ అయింది.

Surya Kumar Yadav: సూర్య ఫామ్‌లోకి వస్తే ఆపడం కష్టం.. మైదానం నలువైపులా ఎలాంటి షాట్లు కొట్టాడో చూడండి..

అలాగే లఖ్‌నవూ మెంటార్ గంభీర్ కూడా కోహ్లీ అవుట్ గురించి పరోక్షంగా స్పందించాడు. కోహ్లీని అవుట్ చేసిన ముంబై బౌలర్ బెహ్రెన్‌డార్ఫ్‌‌ను (Behrendorff) ప్రశంసిస్తూ గంభీర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. బెహ్రెన్‌డార్ఫ్‌ అద్భుతమైన బౌలర్ అంటూ గంభీర్ ప్రశంసించాడు. గతంలో కూడా గంభీర్, నవీనుల్ కోహ్లీని పరోక్షంగా విమర్శిస్తూ పోస్ట్‌లు పెట్టిన సంగతి తెలిసిందే. వీరు కోహ్లీ గురించి చేస్తున్న పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-05-10T11:37:13+05:30 IST