IPL 2023: కోహ్లీ వెర్సస్ గంభీర్.. మ్యాచ్ అనంతరం గంభీర్ ఓవరాక్షన్.. కోహ్లీతో కరచాలనం చేసేటపుడు..

ABN , First Publish Date - 2023-04-11T13:26:04+05:30 IST

బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్ ఆసాంతం అనేక మలుపులు తిరిగింది. క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన మజా అందించింది. ఇరు జట్లు పరుగుల వరద పారించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు.

IPL 2023: కోహ్లీ వెర్సస్ గంభీర్.. మ్యాచ్ అనంతరం గంభీర్ ఓవరాక్షన్.. కోహ్లీతో కరచాలనం చేసేటపుడు..

బెంగళూరులోని (Bengaluru) చిన్న స్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్ ఆసాంతం అనేక మలుపులు తిరిగింది. క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన మజా అందించింది. ఇరు జట్లు పరుగుల వరద పారించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. చివరకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) టీమ్ ఒక వికెట్ తేడాతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) టీమ్‌పై గెలుపొందింది. గెలుపు అనంతరం సెలబ్రేషన్స్ విషయంలో లఖ్‌నవూ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు (Trolling) గురవుతోంది.

ముఖ్యంగా లఖ్‌నవూ ఆటగాడు అవేశ్ ఖాన్ (Avesh Khan), టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) గీత దాటి ప్రవర్తించారు. ముందుగా అవేశ్ ఖాన్ చివరి బంతికి విన్నింగ్ రన్ తీసిన వెంటనే హెల్మెట్ నేలకేసి కొట్టాడు. దీంతో ఐపీఎల్ యాజమాన్యం అతడిని మందలించింది. నెటిజన్లు కూడా అతడిని ట్రోలింగ్ చేస్తున్నారు. చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సిన దశలో అవేష్ క్రీజులో ఉన్నాడు. ఆ బంతి బ్యాట్‌కు తాకకున్నా పరుగు తీసి విజయం అందించాడు. కనీసం బంతికి బ్యాట్ కూడా తాకించలేకపోయావు, ఎందుకంత విర్రవీగడం అంటూ అవేశ్‌పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

RCB vs LSG: బెంగళూరు ఫ్యాన్స్‌పై గంభీర్ అసహనం.. సైలెన్స్ అంటూ సంజ్ఞలు.. వైరల్ అవుతున్న వీడియో!

ఇక, చివరి బంతికి విజయం సాధించడంతో డగౌట్‌లోని గంభీర్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. మైదానంలోకి వస్తూ ఆర్సీబీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ``సైలెన్స్`` అంటూ నోటి మీద చేయి వేసి చూపించాడు. అలాగే మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లతో కరచాలనం సమయంలో కూడా గంభీర్ అతిగా ప్రవర్తించాడు. కోహ్లీ (Virat Kohli) వైపు కోపంగా చూస్తూ వెళ్లిపోయాడు. దీంతో గంభీర్‌పై కూడా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ``కాస్త హుందాగా ప్రవర్తించు`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-04-11T13:26:04+05:30 IST