Dhoni Blasts Deepak Chahar: ధోనీ అన్నా.. ఆటోగ్రాఫ్ ప్లీజ్.. నీకివ్వను పోరా.. దీపక్ చాహర్, ధోనీ వీడియో వైరల్..!

ABN , First Publish Date - 2023-05-30T14:33:16+05:30 IST

ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. ధోనీ నాయకత్వంలో టీమిండియా ఎన్ని ఘనతలు సాధించిందో తెలిసిందే. ఇక, ఐపీఎల్‌లో కూడా ధోనీ కెప్టెన్సీ అద్వితీయం. మొత్తం 14 సీజన్లలో చెన్నై టీమ్‌కు నాయకత్వం వహించి 10 సార్లు తన టీమ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

Dhoni Blasts Deepak Chahar: ధోనీ అన్నా.. ఆటోగ్రాఫ్ ప్లీజ్.. నీకివ్వను పోరా.. దీపక్ చాహర్, ధోనీ వీడియో వైరల్..!

ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఒకడు. ధోనీ నాయకత్వంలో టీమిండియా ఎన్ని ఘనతలు సాధించిందో తెలిసిందే. ఇక, ఐపీఎల్‌లో (IPL) కూడా ధోనీ కెప్టెన్సీ అద్వితీయం. మొత్తం 14 సీజన్లలో చెన్నై టీమ్‌కు నాయకత్వం వహించి 10 సార్లు తన టీమ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. మొత్తం ఐదు సార్లు ట్రోఫీ అందించాడు. తాజా ఐపీఎల్ (IPL 2023)లో పెద్దగా స్టార్లు లేని చెన్నై (CSK) జట్టును తన నాయకత్వ పటిమతో విజేతగా నిలిపాడు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లను అద్భుతంగా వినియోగించుకొని కప్ ఎగరేసుకుపోయాడు.

మ్యాచ్ అనంతరం చెన్నై ఆటగాళ్లందరూ ధోనీ నుంచి ఆటోగ్రాఫ్‌లు (Dhoni Autograph) తీసుకున్నారు. అదే సమయంలో చెన్నై బౌలర్ దీపక్ చాహర్ (Deepak Chahar) కూడా ఆటోగ్రాఫ్ కోసం వెళ్లాడు. అయితే అతడికి ఆటోగ్రాఫ్ ఇచ్చేందుకు ధోనీ నిరాకరించాడు. మ్యాచ్‌లో గుజరాత్ బ్యాట్స్‌మెన్ గిల్ (Shubman Gill Catch) ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను చాహర్ వదిలేశాడు. దీంతో మ్యాచ్ అనంతరం చాహర్‌ను ధోనీ ఆటపట్టించాడు. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదు. అక్కడే ఉన్న బీసీసీఐ వైస్-ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాతో ``సులభమైన క్యాచ్ వదిలేశాడు.. ఆటోగ్రాఫ్ ఇవ్వను`` అని సరదాగా చెప్పాడు.

Jadeja Wife Rivaba: ఏం కావాలి ఇంతకు మించి.. జడేజా భార్య ఎమోషనల్ వీడియో వైరల్..!

ఆ తర్వాత చాహర్ షర్ట్‌పై ఆటోగ్రాఫ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ధోనీ నిజమైన నాయకుడు``, ``గేమ్ జరుగుతున్నపుడు ఎంత సీరియస్‌గా ఉంటాడో.. మామూలుగా ఉన్నప్పుడు అంత సరదాగా ఉంటాడు``, ``మిస్ యూ ధోనీ`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-30T14:33:16+05:30 IST