FIFA Women's World Cup: బోర్జెస్‌ హ్యాట్రిక్‌

ABN , First Publish Date - 2023-07-25T01:49:50+05:30 IST

రి బోర్జెస్‌ హ్యాట్రిక్‌తో.. మహిళల ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ను బ్రెజిల్‌ ఘన విజయంతో ఆరంభించింది. గ్రూప్‌-ఎఫ్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ 4-0తో పనామాను చిత్తు చేసింది.

FIFA Women's World Cup: బోర్జెస్‌ హ్యాట్రిక్‌

4-0తో పనామాపై బ్రెజిల్‌ గెలుపు

ఫిఫా మహిళల వరల్డ్‌కప్‌

అడిలైడ్‌: రి బోర్జెస్‌ హ్యాట్రిక్‌తో.. మహిళల ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ను బ్రెజిల్‌ ఘన విజయంతో ఆరంభించింది. గ్రూప్‌-ఎఫ్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ 4-0తో పనామాను చిత్తు చేసింది. బోర్జెస్‌ (19వ, 39వ, 70వ) మూడు గోల్స్‌ చేయగా.. బెట్రిజ్‌ జానిరాటో (48వ) ఫీల్డ్‌ గోల్‌తో అదరగొట్టింది. గ్రూప్‌-హెచ్‌లో జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ జర్మనీ 6-0తో మొరాకోను చిత్తుచేసింది. జర్మనీ తరఫున అలెగ్జాండ్రా పోప్‌ (11వ, 39వ), క్లారా (46వ), లి షుల్లర్‌ (90వ) గోల్స్‌ సాధించారు. కాగా, మొరాకో ప్లేయర్లు హనానె అల్‌ హజ్‌ (54వ), యాస్మిన్‌ (79వ) సెల్ఫ్‌ గోల్స్‌తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని పెంచారు. గ్రూప్‌-జిలో జరిగిన మ్యాచ్‌లో క్రిస్టియానా జిరెల్లీ (87వ) లేటు గోల్‌తో ఇటలీ 1-0తో అర్జెంటీనాను ఓడించింది.

Updated Date - 2023-07-25T01:53:17+05:30 IST